చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న తెలిపారు. ఏప్రిల్ 11న పోలింగ్ జరిగిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్ జరిగినట్లు గుర్తించామని చెప్పారు. అందుకే రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. మొత్తం 7 కేంద్రాల్లో మళ్లీ ఎన్నిక జరుగుతుందని... ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని అన్నారు.
'ఐదు కాదు... ఏడుచోట్ల చంద్రగిరిలో రీపోలింగ్'
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 7 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి ప్రద్యుమ్న తెలిపారు.
7 places repoling in chandragiri