తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'పేలిన సిలిండర్లు.. 20 లక్షల ఆస్తి నష్టం'

ఖరీఫ్ పంట కోసం పెట్టుబడిగా తెచ్చిపెట్టుకున్న సొమ్ము అగ్నికి ఆహుతైన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పెద్ద మెుత్తంలో ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు.

By

Published : Jun 17, 2019, 2:35 PM IST

ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తాం : తహసీల్దార్

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బుర్​గూడ గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడు సిలిండర్లు పేలి మూడు ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి ఇంట్లోని బంగారం,నగదు, బట్టలు, పప్పు దినుసులు, వడ్లు ఇతర సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు 20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని మూడు కుటుంబాల సభ్యులు వాపోయారు.
ఖరీఫ్ పంట ప్రారంభమైనందున పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు నగదును బ్యాంకు నుంచి ఇంటికి తెచ్చిపెట్టుకున్నామన్నారు. ఇవాళ పత్తి విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉందని..ఇంతలోనే ఇంటికి మంటలు వ్యాపించి అంతా దగ్ధం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే తహసీల్దార్ కిషన్ సందర్శించారు. నష్టాన్ని లెక్కించిన తహసీల్దార్, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

అగ్నికి ఆహుతైన ఇళ్లు

ABOUT THE AUTHOR

...view details