ఒళ్లంతా వెంట్రుకలు... బాలుడికి వింత రుగ్మత
మధ్యప్రదేశ్లోని నంద్లేతాలో 13 సంవత్సరాల బాలుడు లలిత్ పటేదార్ వింత రుగ్మతతో బాధపడుతున్నాడు. అతడి ఒళ్లంతా వెంట్రుకలు పెరిగాయి.
లలిత్ పరిస్థితి ఇలా ఉంటే కొందరు గ్రామస్థులు తమ ప్రవర్తనతో మరింత ఇబ్బందికి గురి చేస్తున్నారు. పిల్లలు ఇతన్ని చూసి భయపడుతున్నారు. ఎగతాళి చేస్తున్నారు. వీటన్నింటికి అలవాటు పడిపోయాడు లలిత్. లక్ష మందిలో ఒకరికి ఇలాంటి రుగ్మత ఉంటుందని వైద్యులు తెలిపారు.
ఈ రుగ్మత లలిత్ సాధారణ జీవితానికి ఎటువంటి అడ్డంకులు సృష్టించలేకపోయింది. పాఠశాలలో చురుకైన విద్యార్థుల్లో లలిత్ ఒకరు. భవిష్యత్లో పోలీసు అధికారి కావడమే లక్ష్యమంటున్నాడు. అవకాశమొస్తే ప్రధానిని కలుస్తానని అంటున్నాడు లలిత్.