ప్రాదేశిక ఎన్నికల్లో మొత్తం 1,56,55,897 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే 32 జిల్లాల్లో పురుషులు 77,48,820 మంది ఉండగా.. మహిళలు 79,06,723, ఇతరులు 354 మంది ఓటర్లుగా నమోదయ్యారని ఈసీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 32,044 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 9,71,040 మంది ఓటర్లు ఉండగా... అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,20,457 మంది ఓటర్లు ఉన్నారు.
ప్రాదేశిక ఎన్నికల్లో 1.56 కోట్ల మంది ఓటర్లు
స్థానిక సంస్థల ఎన్నికల్లో 1.56 కోట్ల మంది ఓటర్లుగా నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మూడు విడతలుగా జరగనున్న ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
1.56 కోట్ల మంది ఓటర్లు