CM KCR Decision to Dismiss UAPA Case Against Haragopal : ఆచార్య హరగోపాల్ సహా ఇతరులపై చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలతో ప్రముఖ హక్కుల నేత హరగోపాల్‌తో పాటు ఇతర ప్రజా సంఘాల నేతలపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆధారాలు లేకుండా ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం దారుణమని.. వెంటనే కేసు ఎత్తివేయాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అన్ని అంశాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. హరగోపాల్ సహా ఇతరులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించారు. వెంటనే కేసుల ఎత్తివేతకు చర్య తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ను సీఎం ఆదేశించారు.
ఆచార్య హరగోపాల్ సహా ఇతరులపై చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. మావోయిస్టు కార్యకలాపాలకు సహకరిస్తున్నారన్న ఆరోపణలతో ప్రముఖ హక్కుల నేత హరగోపాల్‌తో పాటు ఇతర ప్రజా సంఘాల నేతలపై ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆధారాలు లేకుండా ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడం దారుణమని.. వెంటనే కేసు ఎత్తివేయాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అన్ని అంశాలను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. హరగోపాల్ సహా ఇతరులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని నిర్ణయించారు. వెంటనే కేసుల ఎత్తివేతకు చర్య తీసుకోవాలని డీజీపీ అంజనీకుమార్‌ను సీఎం ఆదేశించారు.
ఏడాది క్రితమే హరగోపాల్‌పై కేసు..: హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై తెలంగాణ పోలీసులు తొలిసారి ఉపా (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి పోలీసులు సంవత్సరం క్రితమే ఈ కేసును పెట్టినా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పీపుల్స్ డెమొక్రటిక్ మూవ్‌మెంట్ అధ్యక్షుడు చంద్రమౌళిపై 2 నెలల క్రితం ఉపా కేసు నమోదైంది. బెయిల్ కోసం చంద్రమౌళి.. రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై వాదనల సందర్భంగా పోలీసులు చంద్రమౌళిపై మరిన్ని కేసులున్నాయంటూ కౌంటర్ దాఖలు చేశారు. ఈ మేరకు తాడ్వాయి పీఎస్‌లోని ఎఫ్‌ఐఆర్‌ను సమర్పించారు. అందులోచంద్రమౌళితో పాటు మొత్తం 152 మంది పేర్లుండగా.. వారిలో హరగోపాల్ పేరుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఇప్పటి వరకు 12 చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక కేసులు నమోదయ్యాయి. ప్రతి కేసులోనూ 50 నుంచి 120 మంది వరకు ప్రజా సంఘాల నేతల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లలో చేర్చారు. అయితే.. ప్రొఫెసర్ హరగోపాల్‌పై ఉపా కేసు నమోదైనట్లు వెల్లడి కావడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
తాడ్వాయి అడవుల్లో ఆధారాలు దొరికాయని..:తాడ్వాయి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అడవిలో విశ్వసనీయ సమాచారం మేరకు కూంబింగ్ నిర్వహించగా.. మావోయిస్టులు పారిపోయారని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలో దొరికిన పత్రాల్లో పలువురు ప్రజా సంఘాల నేతలతో మావోయిస్టులకు ఉన్న సంబంధాలపై ఆధారాలు లభించాయంటూ ఆగస్టు 19 2022న ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద రావు, ప్రొఫెసర్ హరగోపాల్, మరో ప్రొఫెసర్ పద్మజాషా సహా మొత్తం 152 మందిపై కేసులు పెట్టారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రజా సంఘాల నేతల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
ఇవీ చూడండి..
ప్రజాస్వామ్య వాదులను ప్రభుత్వం అణిచివేస్తుంది: హరగోపాల్
సీఎం కేసీఆర్‌కు పౌరహక్కుల సంఘం నేత హరగోపాల్ లేఖ