వైఎస్సార్సీపీ మునిగి పోతున్నా జగన్ మేకపోతు గాంభీర్యం! YSRCP Leaders Resignations :ఏపీలో జరిగిన 2019 ఎన్నికల్లో 81 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచి జగన్ తర్వాత రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజార్టీ నెలకొల్పిన ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఈసారి బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. వైఎస్సార్సీపీలో పెత్తనం చెలాయిస్తున్న ఒక ప్రధానసామాజికవర్గ నేతలు తనను ఇబ్బందులు పెడుతున్నారన్నది ఆయన ఆవేదన! అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ఏమీ అభివృద్ధి చేయలేకపోయానని సన్నిహితుల ఎదుట గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో జనంలో పలుచనవడంకన్నా పోటీ నుంచి తప్పుకోవడమే మేలని అన్నా రాంబాబు భావించినట్లు చర్చజరుగుతోంది.
CM Jagan Changes Incharge in AP :విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ మరో నాలుగేళ్లు మండలి సభ్యత్వం ఉన్నా లెక్కచేయకుండా వైఎస్సార్సీపీకి వీడ్కోలు పలికారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేసిన వంశీకృష్ణ సొమ్ములు బాగానే పోగొట్టుకున్నారట. బీసీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పుకునే జగన్ ఆ సామాజిక వర్గానికి చెందిన వంశీని ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నుంచి కార్పొరేటర్‌కు దించేశారు. విశాఖ మేయర్ పదవి ఇస్తామంటూ నమ్మించి కార్పొరేటర్‌గా పోటీ చేయించారు. గెలిచాక మేయర్ పదవి ఇవ్వలేదు. అదేంటని అడుగుదామని ప్రయత్నించిన వంశీకి జగన్ అపాయింట్‌మెంట్ కూడా దక్కలేదు.
ప్రజలు ఆదరిస్తున్నా జగన్ కనికరించట్లేదు: ఎమ్మెల్యే పార్థసారథి సంచలన వ్యాఖ్యలు
వంశీకృష్ణ కోరుకుంటున్న విశాఖ తూర్పు నియోజకవర్గంలో స్థానం లేకుండా చేసి ఎమ్మెల్సీతో సరిపెట్టుకోమన్నారు. కనీసం 2024లోనైనా టికెట్ ఇవ్వాలని వంశీ కోరుతుంటే వైఎస్సార్సీపీ పెద్దలు ఆ స్థానాన్ని విశాఖ ఎంపీ MVV సత్యనారాయణకు అప్పగించారు. ఇప్పటికే విశాఖ మేయర్ వెంకటకుమారి, VMRDA ఛైర్‌పర్సన్ విజయనిర్మల గ్రూపులు వంశీకి వ్యతిరేకంగా పని చేస్తుంటే ఇప్పుడు వారికి ఎంపీ కూడా జతకలిశారు. వాటన్నింటినీ భరిస్తూ నెట్టుకొచ్చిన వంశీ విశాఖలో వైఎస్సార్సీపీ పెద్దల అరాచకాలపై అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీలో ఇంకా కొనసాగితే పార్టీతోపాటు తాను, అనుచరులు నిండా మునిగిపోవాల్సిందేనేననే ఆందోళనతోనే వంశీ వైఎస్సార్సీపీను వీడారు.
Alla Ramakrishna Reddy Resigned :మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డయితే వైఎస్సార్సీపీతోపాటు ఎమ్మెల్యే సభ్యత్వానికీ రాజీనామా చేసేశారు. వైఎస్సార్సీపీ విపక్షంలో ఉన్నపుడు జగన్ కంటే టీడీపీని ఇరుకున పెట్టేందుకు ఆర్కేనే ఎక్కువ పని చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకొచ్చాక కూడా చంద్రబాబుపై లేనిపోని కేసులు మోపి న్యాయస్థానాల చుట్టూ తిరిగేలా చేస్తూ ఒక రకంగా వేధింపులకు గురి చేశారు. ఇవన్నీ జగన్ కళ్లలో ఆనందం కోసమే చేస్తూ వచ్చారు ఆర్కే! చివరకు అమరావతి రాజధానిని జగన్ నాశనం చేస్తున్నా ఎదురుతిరగకుండా భరిస్తూనే వచ్చారు. ఆర్కేను మంత్రివర్గంలోకి తీసుకోకుండా జగన్ మాటతప్పినా ఆయనెప్పుడూ అడగలేదు. మరో 4నెలలు పదవీ కాలం ఉన్నప్పటికీ ఆర్కే వదిలేసున్నారు. వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను జగన్ ఎడాపెడా మార్చేస్తున్న విధానం చూశాక ఆర్కే ఇక వైఎస్సార్సీపీ పరిస్థితి కష్టమేననే అంచనాకు వచ్చి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు.
ఆశలు రేపి మొండిచేయి చూపి, ఆర్కేకే వైసీపీలో ఈ దుస్థితి ఉంటే మిగిలిన వారి పరిస్థితేంటి?
Why Not 175 :ఇలా ఒకరి తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరికొందరు నేతలు వైఎస్సార్సీపీని ఎందుకు వీడుతున్నారు?. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఉన్న అధికారాన్ని కూడా త్యజించి వెళుతున్నారంటే వైఎస్సార్సీపీ పూర్తిగా మునిగిపోతున్న పడవ అని వారు భావిస్తున్నారా? అక్కడే ఉండి మునగడం కంటే బయటకు వెళ్లడం మంచిదని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారా? అంటే? అవుననే సమాధానం వైఎస్సార్సీపీ వర్గాల నుంచే వస్తోంది. ‘వై నాట్ 175’అంటున్న ముఖ్యమంత్రి జగన్ మాటలన్నీ మేకపోతు గాంభీర్యమేనని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భావిస్తున్నట్లుంది.
ప్రభుత్వంపై, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకు ఎదురుగాలి. తప్పదనే అంచనాతో అధికార పార్టీతో తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొందరైతే అయిష్టంగానే కొనసాగుతున్నారు. ఇష్టంలేని వ్యక్తుల కోసం మనసు చంపుకొని పని చేయాల్సి వస్తోందని, వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ బాహాటంగానే ప్రకటించారు. ఇవన్నీ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రతికూల పవనాలకు నిదర్శమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్