తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షర్మిల ఇంట పెళ్లి సందడి - ఫిబ్రవరి 17న వైఎస్ రాజారెడ్డి వివాహం - YS raja reddy marriage 24

YS Sharmila Son YS Raja Reddy Marriage : వైఎస్​ఆర్​టీపీ అధినేత్రి షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం గురించి ఆమె అధికారికంగా ప్రకటించారు. జనవరి నెలలో నిశ్చితార్థం, ఫిబ్రవరిలో వివాహం జరగునున్నట్లు ఆమె ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.

sharmila son marriage 2024
YS Sharmila Son Marriage

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 12:33 PM IST

Updated : Jan 1, 2024, 2:23 PM IST

YS Sharmila Son YS Raja Reddy Marriage :వైఎస్ఆర్​టీపీ అధినేత్రి షర్మిల ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె కుమారుడు వైస్ రాజా రెడ్డికి, అట్లూరి ప్రియతో జనవరి 18వ తేదీన నిశ్చితార్థం వేడుక జరగనున్నట్లు షర్మిల ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఫిబ్రవరి 17వ తేదీన వివాహం జరగనుందని తెలిపారు.

ఈ క్రమంలో ఈనెల 2వ తేదీన (మంగళవారం) కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్​ఆర్​ ఘాట్​ని సందర్శించుకోనున్నట్లు వైఎస్ షర్మిల చెప్పారు. తన కుమారుడి వివాహ తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద పెట్టి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తీసుకుంటామని వెల్లడించారు. ఈ సంవత్సరంలో తమ ఇంట్లో జరగబోయే సంతోషకరమైన విషయం అందరితో పంచుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా షర్మిల తన ట్వీట్​లో పేర్కొన్నారు.

Last Updated : Jan 1, 2024, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details