తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏడాది క్రితం రూ.35వేలు అప్పు.. వడ్డీతో కలిపి రూ.4.5లక్షలు డిమాండ్.. భయంతో ఉరేసుకుని.. - betul latest news

ఓ యువకుడు సంవత్సరం క్రితం ఓ వ్యక్తి నుంచి రూ.35 వేలు అప్పుగా తీసుకున్నాడు. వడ్డీల బాదుడుతో ఆ బకాయి మొత్తం రూ.నాలుగున్నర లక్షలు అయిందంటూ అప్పు ఇచ్చిన వ్యక్తి అతడిపై ఒత్తిడి తెచ్చాడు. తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువకుడు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ ఘటన రాజస్థాన్​లో జరిగింది.

Youth troubled by debt commits suicide in Alwar
Youth troubled by debt commits suicide in Alwar

By

Published : Dec 7, 2022, 4:23 PM IST

Updated : Dec 7, 2022, 5:36 PM IST

రాజస్థాన్​లో ఓ యువకుడు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. రోజూ అప్పుల వాళ్ల నుంచి చంపేస్తామని బెదిరింపులు రావడం వల్లనే ఆ యువకుడు చనిపోయినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అల్వార్​ జిల్లాకు చెందిన ఇమామ్ ఖాన్​​ కుటుంబం నాహర్​పుర్​ ప్రాంతంలో నివాసం ఉంటోంది. ఇమామ్​ సంవత్సరం క్రితం.. జాహుల్ అనే ఓ వ్యక్తి నుంచి రూ.35వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తానికి వడ్డీ విధించి.. రూ.4.5 లక్షలు చెల్లించాలని డిమాండ్​ చేశాడు జాహుల్. కొద్దిరోజులుగా డబ్బుల కోసం ఇమామ్‌పై ఒత్తిడి తెస్తూ చంపేస్తానని బెదిరించేవాడు.

డిసెంబర్​ 3న జాహుల్​ తన సహచరులతో ఇమామ్​ను బెదిరించడానికి ఇంటికి వచ్చాడు. వారిని చూసిన ఇమామ్​ ఇంట్లో దాక్కున్నాడు. ఈ ఘటనతో ఇమామ్​ తీవ్ర మనస్తాపం చెందాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ​ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలం నుంచి తిరిగి వచ్చిన ఇమామ్​ అన్న జావేద్​.. ఆత్మహత్య చేసుకున్న సోదరుడ్ని చూసి ఒక్కసారిగా షాక్​కు గురయ్యాడు. వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు జాహుల్​, అతని సహచరులపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇమామ్​, జాహుల్​ మధ్య జరిగిన కాల్​ రికార్డింగ్స్​ను పరిశీలిస్తున్నట్లు ఎస్సై ఫుఖా​రాజ్​ వెల్లడించారు. పోస్టుమార్టం పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించినట్లు పోలీసులు తెలిపారు.

కన్నబిడ్డలపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన తల్లి..
కర్ణాటకలో ఓ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కన్న తల్లే తన ఇద్దరు చిన్నారులను చంపడానికి ప్రయత్నించింది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. ఈ ఘటన కోలార్​ జిల్లాలోని ములబాగిలు ప్రాంతంలోని అంజనాద్రి కొండలో జరిగింది. ఆంధ్రప్రదేశ్​కు చెందిన జ్యోతి అనే వివాహిత.. తన ఇద్దరు చిన్నారులపై పెట్రోల్​పోసి నిప్పంటించింది. స్థానికులు మంటలను గమనించి అక్కడకు చేరుకునే లేపే.. ఓ చిన్నారి మృతి చెందాడు. మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థులు గాయపడిన చిన్నారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. అసలు ఆ మహిళ ఇలా ఎందుకు చేసిందో ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.

దొంగతనం నెపంతో.. ఐదో తరగతి విద్యార్థినిపై దారుణం..
మధ్యప్రదేశ్​లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఐదో తరగతి​ చదువుతున్న ఓ బాలిక దొంగతనం చేసిందనే నెపంతో హాస్టల్​ సూపరింటెండెంట్​.. ఘోరంగా అవమాన పరిచింది. మిగిలిన విద్యార్ధుల ముందు ఆ బాలిక మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించింది. బేతుల్​ జిల్లాలోని దమ్​జీపురా ప్రాంతంలోని గిరిజన బాలికల హాస్టల్లో గతవారం జరిగిందీ ఘటన. బాలిక తండ్రి.. తన కుమార్తెను చూడడానికి హాస్టల్​కు వెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఐదో తరగతి చదువుతున్న బాలిక దెయ్యంలా కనిపించడానికి ముఖానికి పౌడర్​ పూసుకుని.. మరో బాలికకు చెందిన రూ.400 దొంగతనం చేసిందని హాస్టల్​ సూపరింటెండెంట్ ఆరోపించింది. దీంతో తనకు ఈ రకమైన శిక్ష విధించినట్లు బాలిక తన తండ్రి వద్ద వాపోయింది. ఆ హాస్టల్​లో ఉండలేనని చెప్పింది. మంగళవారం బాలిక తండ్రి దీనిపై కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన గిరిజన వ్యవహారాల శాఖ అసిస్టెంట్ కమిషనర్ శిల్పాజైన్ హాస్టల్ సూపరింటెండెంట్‌ను విధుల నుంచి తప్పించారు.

Last Updated : Dec 7, 2022, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details