తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా లవర్​తో మాట్లాడించండి.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా'.. కత్తితో యువకుడు హల్​చల్! - బంగాల్ లేటెస్ట్ న్యూస్

బంగాల్​ పుజాలిలో ఓ యువకుడు హల్​చల్ సృష్టించాడు. తన ప్రియురాలితో మాట్లాడించకపోతే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

Youth love with minor
Youth love with minor

By

Published : Oct 15, 2022, 11:59 AM IST

Updated : Oct 15, 2022, 12:11 PM IST

తన ప్రియురాలితో మాట్లాడించకపోతే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు ఓ యువకుడు. ఈ ఘటన బంగాల్​లోని పుజాలిలో జరిగింది. పోలీస్ స్టేషన్​ ఎదుటే గొంతుపై కత్తి పెట్టుకుని నిలబడ్డాడు.

షేక్​ సొహైల్​ అనే వ్యక్తి మాయాపుర్​ గ్రామంలో నివసిస్తున్నాడు. అతడు పుజాలి గ్రామంలో నివసిస్తున్న ఓ బాలికను ప్రేమిస్తున్నాడు. 22 రోజుల క్రితం ఇద్దరు కలిసి పారిపోయారు. మూడు రోజుల పాటు ఈ జంట తిరిగి వచ్చింది. వీరి ప్రేమ వ్యవహారాన్ని యువకుడి కుటుంబం అంగీకరించగా.. బాలిక కుటుంబం మాత్రం వ్యతిరేకించింది. తమ కుమార్తెను ఎత్తుకెళ్లారంటూ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. షేక్ సొహైల్​ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

తాజాగా జైలు నుంచి బెయిల్​పై విడుదలయ్యాడు సొహైల్​. ఇదే కేసు విషయమై బాలికను ఆమె తండ్రిని పోలీస్ స్టేషన్​కు పిలిపించారు. ఈ విషయం తెలుసుకున్న సొహైల్​.. పోలీస్ స్టేషన్​ వద్దకు చేరుకున్నాడు. బాలికతో ఒక్కసారైనా మాట్లాడించాలంటూ వేడుకోగా.. ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు.. తన ప్రియురాలితో మాట్లాడించకపోతే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. అప్రమత్తమైన పోలీసులు.. బాలికను అక్కడినుంచి పంపించేశారు. అనంతరం సొహైల్​ను ఇంటికి తీసుకెళ్లి విడిచిపెట్టారు.

ఇవీ చదవండి:కారు కట్నంగా ఇవ్వలేదని ఫోన్​లోనే తలాక్​.. వేరే మహిళతో పెళ్లి!

అక్కడి నర్సులకు అందమే ముఖ్యం.. రూ.1500 లంచం ఇస్తేనే వైద్యం..

Last Updated : Oct 15, 2022, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details