తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎమ్మెల్యే కారుకు నిప్పంటించిన యువకుడు

Youth sets fire mla car: పానీపత్​ భాజపా ఎమ్మెల్యే కారుకు ఓ ఆగంతుకుడు నిప్పంటించాడు. మొదట కారును ధ్వంసం చేసి ఆ తర్వాత పెట్రోల్​ బాటిల్​తో వచ్చి వాహనాన్ని తగలబెట్టాడు. చండీగఢ్​లో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

youth sets fire in bjp mla, ఎమ్మెల్యే కారుకు నిప్పంటించిన యువకుడు  car
ఎమ్మెల్యే కారుకు నిప్పంటించిన యువకుడు

By

Published : Dec 29, 2021, 3:37 PM IST

Updated : Dec 29, 2021, 5:22 PM IST

ఎమ్మెల్యే కారుకు నిప్పంటించిన యువకుడు

Youth sets fire mla car: హరియాణా పానీపత్ భాజపా​ ఎమ్మెల్యే ప్రమోద్​ విజ్​ కారుకు ఓ గుర్తు తెలియని యువకుడు నిప్పంటించాడు. వాహనం చండీగఢ్​ ఎమ్మెల్యే హాస్టల్​లో పార్కు చేసి ఉండగా.. మంగళవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఈ చర్యకు పాల్పడ్డాడు. ఘటన సమయంలో కారులో గానీ, చుట్టుపక్కల గానీ ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణనష్టం జరగలేదు.

ఎమ్మెల్యే కారుకు నిప్పంటించిన యువకుడు

తనకు ఎవరూ శత్రువులు లేరని, అల్లరిమూకల్లో ఒకరే ఈ పని చేసి ఉంటారని ఎమ్మెల్యే ప్రమోద్​ విజ్ అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడ్ని త్వరలోనే పోలీసులు పట్టుకుంటారని చెప్పారు.

ఇదీ జరిగింది..

Panipat mla car fire

మంగళవారం హరియాణా కేబినెట్​ విస్తరణ సందర్భంగా ఎమ్మెల్యే ప్రమోద్ విజ్ చండీగఢ్​ వచ్చారు. ఆయన పంచకులలో బస చేసినప్పటికీ కారు డ్రైవర్​, భద్రతా సిబ్బంది మాత్రం ఎమ్మెల్యే హాస్టల్​కు వెళ్లారు. అర్ధరాత్రి 12:30గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కారు దగ్గరకు వచ్చాడు. అద్దాన్ని ధ్వంసం చేశాడు. ఇంతలో కారు సైరన్​ మోగగానే డ్రైవర్​ హాస్టల్​ నుంచి బయటకు వచ్చాడు. అతడ్ని చూసి ఆగంతుకుడు పరుగులు తీశాడు. అనంతరం కాసేపటికే అతడు మళ్లీ తిరిగివచ్చాడు. ఈసారి పెట్రోల్​ బాటిల్​తో వచ్చి కారుపై పోశాడు. అనంతరం నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయాడు. అగ్నిమాపక దళం రంగంలోకి మంటలను అదుపు చేసింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే టోయోటా ఫార్చునర్​ ముందుభాగం పూర్తిగా కాలిపోయింది.

సీసీటీవీలో ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ఆగంతుకుడు మద్యం మత్తులో ఉండి ఈ పని చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురి ప్రమేయం ఉందని భావిస్తున్నారు. వారి కోసం గాలిస్తున్నారు.

ఈ విషయాన్ని హరియాణా అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్​చంద్​​ దృష్టికి ఎమ్మెల్యే ప్రమోద్ విజ్​ తీసుకెళ్లారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ఇంతటి కట్టుదిట్టమైన భద్రత గల ప్రదేశంలో ఇలా జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పంజాబ్​, హరియాణా అధికారులతో ఉమ్మడి సమీక్ష నిర్వహిస్తామన్నారు. శాంతిభద్రతల విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్​.. పంజాబ్, హరియాణాకు ఉమ్మడి రాజధానిగా ఉంటోంది.

ఇదీ చదవండి:ఇంజినీరింగ్​ కాలేజీలో కరెంట్​​ షాక్​.. నలుగురు మృతి

Last Updated : Dec 29, 2021, 5:22 PM IST

ABOUT THE AUTHOR

...view details