తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నీవు లేని లోకంలో ఉండలేను.. నీవెంటే నేను'.. ప్రియుడి మరణం తట్టుకోలేక.. - Nursing student Mounika suicide in yanam

Young Woman Suicide After Her Lover Death: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగింది. ప్రేమించిన యువకుడు వ్యసనాలకు బానిసై క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు. ప్రియుడు ఎడబాటు భరించలేని ప్రియురాలు కూడా మానసికంగా కుంగిపోయింది. ఎంత మరచిపోదామనుకున్నా అతని జ్ఞాపకాలు ఆమెను విడువలేదు. చివరికి ప్రియుడిని మరచిపోలేక తనువు చాలించింది.

Young_Woman_Suicide_After_Her_Lover_Death
Young_Woman_Suicide_After_Her_Lover_Death

By

Published : Aug 22, 2023, 2:19 PM IST

Young Woman Suicide After Her Lover Death: ఆమె ఒంటరి జీవితంలోకి వచ్చి వసంతాన్ని కురిపించాడు ఆ యువకుడు. పరిచయం పెరిగి ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి జీవితాంతం కలిసి ఉందామనుకున్నారు. కానీ అంతలోనే విషాదం. ప్రేమించిన యువకుడు మత్తుకు బానిసై.. ఆలోచన లేకుండా ప్రాణాలు తీసుకున్నాడు. అతన్ని గాఢంగా ప్రేమించిన ఆ యువతి అతన్ని మరువలేకపోయింది. ప్రియుడి ఎడబాటు తట్టుకోలేకపోయింది. ఒక్కతే మానసికంగా కుంగిపోయింది. తన బాధను పంచుకోవడానికి తోడు లేకపోవడంతో విపరీతమైన ఒత్తిడికి గురైంది. దీంతో ఓ షాకింగ్​ నిర్ణయం తీసుకంది. 'నీవు లేని లోకంలో నేను ఉండలేను' అంటూ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో చోటుచేసుకుంది.

కన్నవాళ్లను ఒప్పించలేక... కలిసి బతకలేక..

Yanam Young Woman Committed Suicide Due to Her Lover Death:పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలోని యూకేవీ నగర్​కి చెందిన మీసాల మౌనిక తల్లిదండ్రులు పది సంవత్సరాల క్రితం చనిపోయారు. ఈమెకు ఓ అక్క, చెల్లి ఉన్నారు. మౌనిక కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చొల్లంగిలోని రాయల్​ కాలేజీలో నర్సింగ్​ చదువుతోంది. ఈమె అక్క, చెల్లికి వివాహాలై అత్తవారింట్లో ఉంటున్నారు. మౌనిక ప్రస్తుతం మేనమామ త్రిమూర్తులు సంరక్షణలో ఉంటోంది. రెండు సంవత్సరాలుగా కురసాంపేటకు చెందిన నిమ్మకాయల చిన్నాతో ప్రేమలో ఉంది. గంజాయికి బానిసైన చిన్నా రెండు నెలల క్రితం 500 రూపాయలు అడిగితే తన సోదరుడు ఇవ్వలేదనే కోపంతో ఒంటికి నిప్పంటించుకున్నాడు. వెంటనే గమనించిన కుటుంబసభ్యులు మంటలు ఆర్పి కాకినాడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.

అప్పటికీ.. ఎప్పటికీ..నువ్వు నా మనసులోనే..!

తాను ప్రేమించిన చిన్నా మరణించడంతో షాక్​కు గురైన మౌనిక అప్పటి నుంచి కాలేజీకి వెళ్లడం మానేసింది. నిత్యం చిన్నాను తలచుకొని కుంగిపోయింది. అతనికి సంబంధించిన వస్తువులు, దుస్తులు, ఫొటోలు తన గదిలోని గోడలకు అతికించి చూసుకుంటోంది. కనీసం గది దాటి బయటకు కూడా రావడం లేదు. అలానే మానసిక కుంగుబాటుతో సోమవారం ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుంది. మేనమామ త్రిమూర్తులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన బంధువులకు అప్పగించారు. అనంతరం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లుతెలిపారు. కాగా, యువతి మరణంతో కుటుంబ సభ్యుల రోదన తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కేవలం రెండు నెలల వ్యవధిలో ప్రేమికుల మరణం ఇరుకుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

SUICIDE:‘నిన్ను మర్చిపోవాలంటే నేను చచ్చిపోవాలి’.. వైరల్ అవుతున్న యువకుడి సూసైడ్​ లేఖ

ABOUT THE AUTHOR

...view details