ప్రియురాలితో కలిసి లాడ్జికి వెళ్లిన 25 ఏళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్ర.. నాగ్‌పుర్‌లోని సావనేర్లో జరిగింది. శృంగార సామర్థ్యాన్ని పెంచే మాత్రలు ఎక్కువ మోతాదులో వాడడం వల్లే మృతుడు అజయ్ చనిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు జేబులో శృంగార సామర్థ్యాన్ని పెంచే సంబంధిత మాత్రలు దొరికాయని పోలీసులు తెలిపారు. ఇది హత్యా? లేదా ఇంకేమేనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేయసితో కలిసి లాడ్జికి.. యువకుడు హఠాన్మరణం.. జేబులో 'శృంగార' మాత్రలు - శృంగార సామర్థ్యాన్ని పెంచే మాత్రలను అధికంగా వాడడం వల్ల యువకుడు మృతి
ప్రియురాలితో కలిసి లాడ్జికి వెళ్లిన ఓ యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించేసరికి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి జేబులో శృంగార సామర్థ్యాన్ని పెంచే మాత్రలు పోలీసులకు లభించాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
అసలేం జరిగిందంటే: అజయ్, అతని ప్రియురాలితో కలిసి ఆదివారం సాయంత్రం సావనేర్లోని ఓ లాడ్జికి వెళ్లాడు. అనంతరం అజయ్ స్పృహ తప్పిపడిపోయాడు. ఈ విషయాన్ని అజయ్ ప్రియురాలు.. లాడ్జి సిబ్బందికి, అతని స్నేహితులకు ఫోన్ చేసి చెప్పింది. హుటాహుటిన అజయ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
గతేడాది సైతం ఇలాంటి ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఆ సంవత్సరం జనవరి 7న లాడ్జిలో పోర్న్ వీడియోలు చూసి కొత్త భంగిమల్లో శృంగారం చేయాలనుకొని 28 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ చదవండి: