తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లి కడచూపు కోసం ఆస్పత్రి భవనం ఎక్కిన యువకుడు

కరోనాతో మృతి చెందిన తన తల్లిని కడసారి చూసేందుకు ఓ యువకుడు ఏకంగా ఆస్పత్రి భవనం ఎక్కాడు. మృతురాలిని చూసేందుకు అధికారులు నిరాకరించారని ఈ సాహసం చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Covid death
కరోనా మృతులు

By

Published : Apr 26, 2021, 1:51 PM IST

Updated : Apr 26, 2021, 2:34 PM IST

కరోనా.. ఎంతో మందిని బలితీసుకుని ఆ కుటుంబాలకు శోకాన్ని మిగిల్చడమే కాదు, కడచూపు కూడా లేకుండా చేస్తోంది. అయితే తన విషయంలో అలా జరగకూడదని కర్ణాటక కలబురిగి జిల్లాకు చెందిన ఓ యువకుడు.. కొవిడ్​తో చనిపోయిన తన తల్లిని చూసేందుకు ఆస్పత్రి భవనం ఎక్కాడు.

తల్లి ఆఖరిచూపు కోసం భవనం ఎక్కిన యువకుడు

తన తల్లిని చివరి చూపు చూసేందుకు అధికారులు అంగీకరించకపోవడం వల్ల ఈ సాహసం చేశాడు. అయితే కొంత సమయం తర్వాత ఆ యువకుడి డిమాండ్​ మేరకు మృతురాలిని చూసేందుకు అధికారులు అనుమతించారు.

12 రోజుల క్రితం కొవిడ్​తో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు.. ఆదివారం మరణించింది.

ఇదీ చూడండి:ఆక్సిజన్​ కొరతతో రోగులు మృతి- బంధువుల ఆందోళన

Last Updated : Apr 26, 2021, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details