2024లో దేశ ప్రధాన మంత్రిగా(prime minister of india) ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(yogi adityanath news) ఎన్నికవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు హిందూ రక్షా సేన జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రబోధానంద గిరి(prabodhananda swami). ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీబీత్లో ఒక్కరోజు పర్యటనకు వచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
యోగికి (yogi adityanath latest news) మాత్రమే భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించగల సత్తా ఉందని పేర్కొన్నారు ప్రబోధానంద(prabodhananda swami).
" 2017 ఎన్నికల సమయంలో యూపీ ముఖ్యమంత్రి యోగి కావాలని, వేరే వారు సీఎం అయితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పాను. హిందువుల తరఫున పోరాడేది కేవలం యోగి ఒక్కరే. ఇప్పుడు కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హిందూ, హిందుత్వానికి రక్షణగా ఎలాంటి భయం లేకుండా నిర్ణయం తీసుకునేది యోగి ఒక్కరే. 2024లో యోగి ప్రధాని అయితేనే హిందూవులకు మేలు జరుగుతుంది. భారత్‌కు ప్రధానమంత్రి యోగి కావాలని కోరుకుంటున్నాం. "