తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా వైకే సిన్హా - కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్​గా వైకే సిన్హా శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. మూడేళ్ల పాటు సిన్హా.. ఈ పదవిలో ఉండనున్నారు. పాత్రికేయుడు ఉదయ్ మహుర్కర్, కార్మిక శాఖ మాజీ కార్యదర్శి హీరాలాల్ సమారియా, కాగ్‌ మాజీ అధికారి సరోజ్‌ పున్హానీలు... సిన్హాకు సహ కమిషనర్లుగా నియమితులయ్యారు.

YK Sinha As New Chief Central Information Commissioner
కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా వైకే సిన్హా

By

Published : Nov 7, 2020, 6:54 AM IST

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ)గా యశ్వర్ధన్‌కుమార్‌ సిన్హా శనివారం బాధ్యతలు చేపట్టనున్నారు. మాజీ దౌత్యాధికారి, ప్రస్తుత సమాచార కమిషనర్‌ అయిన సిన్హా చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయిస్తారు.

పాత్రికేయుడు ఉదయ్‌ మహుర్కర్‌, కార్మికశాఖ మాజీ కార్యదర్శి హీరాలాల్‌ సమారియా, కాగ్‌ మాజీ అధికారి సరోజ్‌ పున్హానీలు... సిన్హాకు సహ కమిషనర్లుగా నియమితులయ్యారు. 62 ఏళ్ల సిన్హా.. మూడేళ్లు ఈ పదవిలో ఉంటారు. కమిషనర్లుగా పై ముగ్గురి నియామకంతో దేశంలో సమాచార కమిషనర్ల సంఖ్య ఏడుకు చేరింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details