తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Wrongfully imprisoned: చేయని నేరానికి 19 ఏళ్లు జైల్లో..

Wrongfully imprisoned: ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి చేయని నేరానికి 19 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. 2005లో జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా.. హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి కేసు విచారణ జరిపిన న్యాయస్థానం సింధును నిర్దోషిగా ప్రకటించింది.

wrongfully imprisoned
wrongfully imprisoned

By

Published : Dec 17, 2021, 10:41 AM IST

Wrongfully imprisoned: చేయని నేరానికి హబిల్‌ సింధు అనే వ్యక్తి 19 ఏళ్లు జైలులో మగ్గిన దీనగాథ ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. 2003లో జాసీపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బలరాంపుర్‌లో మూడు హత్యలు జరిగాయి. హబిల్‌ సింధు క్షుద్ర పూజలు చేసి ఈ హత్యలకు పాల్పడ్డాడని గ్రామస్థులంతా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఈ క్రమంలో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

2005లో జిల్లా అదనపు సెషన్స్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న హబిల్‌ హైకోర్టును ఆశ్రయించారు. మరోసారి కేసును విచారించాలని జిల్లా సెషన్స్‌ న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో 11 మంది సాక్షుల వాంగ్మూలం సేకరించి, మరికొందరిని విచారించిన కోర్టు... హబిల్‌ సింధును నిర్దోషిగా ప్రకటించింది. 19 ఏళ్ల తర్వాత బుధవారం కారాగారం నుంచి విడుదలైన హబిల్‌ తన జీవితంలో ఎంతో విలువైన కాలం వృథా అయిందని వాపోయారు.

ఇదీ చూడండి:ఆ భయంతో.. తల్లిదండ్రులను నరికి చంపిన బాలుడు!

ABOUT THE AUTHOR

...view details