తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచంలోనే అతిపెద్ద కణితి తొలగింపు- బరువు ఎంతంటే?

ఓ పాతికేళ్ల యువకుడి ఛాతి భాగం నుంచి ఏకంగా 13.85కిలోల కణితిని తొలగించారు హరియాణా వైద్యులు. ప్రపంచంలో శస్త్రచికిత్స చేసి తీసిన కణితుల్లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం.

Worlds largest Chest Tumour
ప్రపంచంలోనే అతిపెద్ద కణితి

By

Published : Oct 22, 2021, 9:19 AM IST

Updated : Oct 22, 2021, 10:23 AM IST

హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పాతికేళ్ల యువకుడి ఛాతీ భాగం నుంచి 13.85 కిలోల కణితిని వైద్యులు తొలగించారు. అందుబాటులోని వైద్య సమాచారం మేరకు.. ప్రపంచంలో శస్త్రచికిత్స ద్వారా తొలగించిన కణితుల్లో ఇదే పెద్దదని ఆ ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు.

2015లో గుజరాత్‌ వైద్యులు తొలగించిన 9.5 కిలోల కణితే ఇప్పటిదాకా పెద్దదిగా భావించేవారమని వెల్లడించారు. గురుగ్రామ్‌లోని ఫోర్టిస్‌ రీసెర్చ్‌ మెమోరియల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ శస్త్రచికిత్స చేశారు. ఆసుపత్రి డైరెక్టర్‌, హెడ్‌ అయిన డాక్టర్‌ ఉద్గీత్‌ ధీర్‌ మాట్లాడుతూ.. 'చాలా రిస్కుతో కూడిన ఈ శస్త్రచికిత్స నాలుగు గంటలపాటు చేశాం. ఊపిరాడని స్థితిలో మా వద్దకు వచ్చిన ఆ యువకుడిది మరీ అరుదైన ఏబీ నెగెటివ్‌ గ్రూపు రక్తం. ఇప్పుడతణ్ని ఐసీయూ నుంచి బయటకు తెచ్చాం. పరిస్థితి నిలకడగా ఉంది', అని వివరించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కణితి

ఇదీ చూడండి:-మెదడులో.. కణితి ఎలా ఏర్పడుతుంది?

Last Updated : Oct 22, 2021, 10:23 AM IST

ABOUT THE AUTHOR

...view details