తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకేసారి 2 చేతులతో రాసి.. ప్రపంచ రికార్డు కొల్లగొట్టి.. - handwriting

చేతిరాతతో ప్రపంచ రికార్డు కొల్లగొట్టింది కర్టాటకకు చెందిన ఆదిస్వరూప. ఓ చేత్తో మామూలు అక్షరాలు మరో చేత్తో వాటి ప్రతిబింబాలు రాయగలదు ఆమె. స్వరూప.. ఇప్పటికే ఓ నవల కూడా రాసింది. ఇంకా.. ఏకకాలంలో 16 మంది చెప్తుండగా విని, రాయాలని ప్రయత్నిస్తోంది స్వరూప.

World record for handwriting
చేతిరాతతో ప్రపంచ రికార్డు

By

Published : Apr 24, 2021, 9:02 AM IST

చేతిరాతతో ప్రపంచ రికార్డు సాధించిన స్వరూప

ఇక్కడ బోర్డుపై అక్షరాలు రాస్తున్న యువతి పేరు ఆదిస్వరూప. ఎవరైనా బోర్డుపై రాయగలరు. కానీ ఈ అమ్మాయి మాత్రం రెండుచేతులతో ఒకేసారి రాయగలదు. అందుకే మంగళూరుకు చెందిన ఆదిస్వరూప ప్రపంచ రికార్డు తన పేరిట రాసుకుంది. ఓ చేత్తో మామూలు అక్షరాలు మరో చేత్తో వాటి ప్రతిబింబాలు రాయగల అద్భుత కళ ఆదిస్వరూప సొంతం.

మంగళూరుకు చెందిన 16 ఏళ్ల ఆదిస్వరూప ఒక్క నిమిషంలోనే.. రెండు చేతులనూ వినియోగించి, 45 పదాలు రాసి, ప్రపంచ రికార్డు తన పేరిట రాసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీకి చెందిన లాటా ఫౌండేషన్ ఈ రికార్డు సాధించినందుకు గానూ.. స్వరూపను సత్కరించింది.

ఆది స్వరూప.. ఒకేసారి రెండు చేతులతో రాసే ప్రత్యేకతను సొంతం చేసుకుంది. అంతేకాదు.. కుడిచేత్తో రాసేదాని అద్దం ప్రతిబింబాన్ని ఎడమ చేత్తో రాసి, ఔరా అనిపిస్తోంది. స్వరూప తండ్రి గోపాద్‌కార్ స్వరూప అధ్యయన కేంద్రం డైరెక్టర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బడికి వెళ్లకుండానే ఈ ఏడాది ఎస్​ఎస్​ఎల్​సీ పరీక్ష రాశారాయన.

కళ్లకు గంతలు కట్టుకొని రాస్తున్న స్వరూప

"పదాలు, వాక్యాలను ఒకేసారి రెండుచేతులతో రాయగలన్నేను. ఒక్క నిమిషంలో 36 పదాలు చకచకా రాసేస్తాను. కళ్లు మూసుకుని కూడా పదాలు రాస్తాను."

-ఆదిస్వరూప, ప్రపంచ రికార్డు సృష్టించిన బాలిక

స్వరూప.. ఇప్పటికే ఓ నవల రాసింది. మరో నవల రాసేందుకు సిద్ధంగా ఉంది. హిందుస్తానీ సంగీతం, యక్షగానం, చిత్రకళ సహా.. ఇతర అంశాల్లోనూ ఆమెకు మంచి పట్టుంది.

ప్రపంచ రికార్డు ధ్రువపత్రం, పతకం

ఆది స్వరూప తండ్రి గోపాద్‌కార్.. స్వరూప అధ్యయన కేంద్రం పేరుతో ఓ విద్యాసంస్థ నడుపుతున్నారు. పాఠ్యపుస్తకాల్లోని పాఠాల కంటే.. ఇతర అంశాలను పిల్లలకు నేర్పించడంపైనా ఇక్కడ దృష్టి పెడతారు. స్వరూప విద్యాకేంద్రంలో ప్రధానంగా విద్యార్థులకు సంగీతం, చిత్రకళ, నాటకాల్లాంటి సాంస్కృతిక అంశాలలో పిల్లలకు ప్రత్యేక శిక్షణనిస్తారు.

"మా స్వరూప అధ్యయన కేంద్రంలో పిల్లలకు ఎడమ చేతితో రాయడం నేర్పిస్తాం. సాధన చేసిన తర్వాత నా కుమార్తె ఆది పదాలు, వాక్యాలు రెండు చేతులతో రాయడం ప్రారంభించింది. రెండు చేతులతో రాయడం నేర్చుకున్నాక, 10 విభిన్న రకాల శైలిలో రాయడంపైనా పట్టు సాధించింది. కష్టపడితే ఎవ్వరైనా ఇలా రాయవచ్చన్నది నా అభిప్రాయం.''

-గోపాద్‌కార్, ఆదిస్వరూప తండ్రి

ఏకకాలంలో 16 మంది చెప్తుండగా విని, రాయాలని ప్రయత్నిస్తోంది స్వరూప. ఈ అంశంలోనూ మరో ప్రపంచ రికార్డు సృష్టించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. రూబిక్ క్యూబ్, స్పీడ్‌బాక్స్, మిమిక్రీల్లోనూ రికార్డుల దిశగా సాధన చేస్తోంది.

ఇదీ చూడండి:భళా బంధకళ.. అబ్బురపరుస్తున్న చేనేత చీరలు

ABOUT THE AUTHOR

...view details