కేరళ తిరువనంతపురంలో దారుణం జరిగింది. ఓ మహిళ తన భర్తపై యాసిడ్ పోసి, కుమారుడ్ని బావిలో తోసేసింది. అనంతరం తానూ అదే బావిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడింది.
తిరువనంతపురం పులిమత్కు చెందిన బిందు(40) రెండో వివాహం చేసుకుంది. భర్త, ఇద్దరు కుమారులతో నివసిస్తోంది. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. కానీ సోమవారం రాత్రి జరిగిన గొడవలో బిందు తన భర్తపై యాసిడ్ పోసి ఐదేళ్ల కుమారుడ్ని బావిలో తోసేసింది. అనంతరం ఆమె కూడా అదే బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పెద్ద కుమారుడు ఇరుగుపొరుగువారికి విషయం చెప్పాడు.