Woman killed by friend: లోన్ తీర్చే విషయంలో వివాదం రావడం వల్ల ఓ మహిళను ఆమె స్నేహితురాలు గొంతు కోసి హత్య చేసింది. నిందితురాలు, ఆమె భర్త కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ప్యాక్ చేసి పొదల్లో పడేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలోని కపిల్నగర్ ప్రాంతంలో సోమవారం జరిగింది.
మృతురాలు దీపా జుగల్ దాస్ (41) పాఠశాల బస్సు డ్రైవర్‌గా పని చేస్తోంది. దీప.. శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తర్వాత నుంచి కనిపించలేదు. ఆదివారం రాత్రి దీపా మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. ఇదిలా ఉండగా.. ఉప్పల్‌వాడి ప్రాంతంలో ప్లాస్టిక్ సంచిలో ఒక మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం దీపదిగా గుర్తించారు.