కంప్యూటర్ సెంటర్లో వివాహితపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన సమయంలో మహిళపై అకృత్యానికి తెగబడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో జరిగింది. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరొక నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం:
బాధితురాలు మే 28న అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రజాసేవ కేంద్రానికి వెళ్లింది. ప్రజాసేవ కేంద్రంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్, షాపు యజమాని, ప్రజాసేవ కేంద్రం నిర్వాహకుడు, మరొక వ్యక్తి కలిసి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ దుశ్చర్యను వీడియో తీశారు. అత్యాచారానికి పాల్పడిన వీడియోను బాధితురాలి అత్తమామలకు పంపారు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు నివసించే అలీగఢ్ ప్రాంతానికి చెందిన వ్యక్తే ప్రధాన నిందితుడు. బాధితురాలు, నిందితులు కలిసి చదువుకున్నారని పోలీసులు తెలిపారు.
కన్నకూతుర్ని చంపేందుకు సుపారీ:
మరోవైపు, ప్రేమించిన వ్యక్తిని కలవద్దని పలుమార్లు చెప్పినా వినని కూతుర్ని చంపేందుకు కుట్ర పన్నాడు ఓ తండ్రి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగింది. ఆసుపత్రి వార్డ్ బాయ్ నరేష్ కుమార్‌తో కుమార్తెను హతమార్చేందుకు రూ.లక్ష సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు నవీన్ కుమార్.