కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. కెరూర్ ఘటనలో గాయపడినవారికి పరామర్శించేందుకు ఆయన బాగల్కోటేలోని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ క్షతగాత్రుని కుటుంబానికి రూ.2 లక్షలను నష్టపరిహారాన్ని ఇచ్చి ఆయన కారు ఎక్కుతుండగా ఓ ముస్లిం మహిళ ఎస్కార్ట్ వాహనంపైకి ఆ డబ్బులను విసిరేసింది.
'ఎన్నికల సమయంలో మాత్రమే ఓట్లు అడిగేందుకు వస్తారు. ఇప్పుడు మన సమస్యలేవీ పట్టించుకోరు. హిందువులైనా, ముస్లింలైనా అందర్ని సమానంగా చూడాలి. కానీ మేం ఏ తప్పు చేయకపోయినా.. కారణం లేకుండా మా వారిపై దాడి చేశారు. ఈరోజు పరిహారం ఇస్తారు. గాయపడిన మా వారు ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాలి. డబ్బు మా సమస్యకు పరిష్కారం కాదు. భిక్షాటన చేసి అయిన మా కుటుంబాన్ని పోషించేందుకు సిద్ధంగా ఉన్నాం.'
-ముస్లిం మహిళ