దొంగకు ఓ మహిళ చుక్కలు చూపించింది. చోరికి వచ్చిన అతడి చేతివేళ్లను కొరికేసింది. దీంతో అతడి చేతివేలొకటి తెగిపోయింది. అనంతరం తెగిన వేలు తీసుకుని పోలీసులను ఆశ్రయించింది మహిళ. ఉత్తర్ప్రదేశ్లో ఈ ఘటన జరిగింది. మహిళ దైర్యాన్ని మెచ్చుకున్న పలువురు.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కౌశాంబి జిల్లాలోని కరారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది.
దొంగకు చుక్కలు చూపించిన మహిళ... కొరికేసిన చేతివేలితో పోలీస్ స్టేషన్కు.. - ఉత్తర్ప్రదేశ్లో దొంగ వేలును నరికిన మహిళ
దొంగ చేతివేళ్లను కొరికేసింది ఓ మహిళ. తన వస్తువులు చోరీ చేసేందుకు వచ్చిన దొంగకు చుక్కలు చూపించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తర్ప్రదేశ్లో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే..
బాధితురాలు నీతాదేవి.. శ్రీచంద్ భార్య. మయోహర్ గ్రామంలో నివాసం ఉంటోంది. శనివారం సాయత్రం నీతాదేవి.. కూరగాయల కోసం కాలినడకన వెళ్లింది. ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమె వస్తువులను చోరీ చేసేందుకు దొంగ ప్రయత్నించాడు. నీతాదేవిని దొంగ చాలాసేపు రహస్యంగా వెంబడిస్తూ వచ్చాడు. నిర్మానుష ప్రదేశం వచ్చేసరికి ఆమె నగలు, డబ్బులు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు.
అదే సమయంలో నీతా దేవి గట్టిగా అరించింది. దీంతో ఆమె నోరును మూశాడు దొంగ. అప్పుడు దొంగ వేళ్లు నీతాదేవి నోటిలో చిక్కాయి. అదే అదునుగా దొంగ చేతి వేళ్లను గట్టిగా కొరికింది నీతాదేవి. దీంతో దొంగ ఒక చేతి వేలు తెగిపోయింది. మహిళ కేకలు విన్న చుట్టుపక్క ప్రజలు.. అక్కడి చేరుకునే ప్రయత్నం చేశారు. అది గమనించిన దొంగ అందినంత దోచుకుని పారిపోయాడు. వెంటనే దొంగ చేతివేలుతో బాధిత మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై వారికి ఫిర్యాదు చేసింది. దొంగ తన బంగారు గొలుసు, ఒక కాళ్ల పట్టి, నాలుగు వేల రూపాయలు చోరీ చేసినట్లు తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే నిందితున్ని పట్టుకోనున్నట్లు వెల్లడించారు.