తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కులాంతర వివాహం చేసుకుందని గుండు కొట్టారు! - మహిళలపై నేరాలు

ఉత్తర్​ప్రదేశ్​లో హేయమైన ఘటన జరిగింది. వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో.. ఓ యువతిని ఎత్తుకెళ్లి.. ఆపై దాడి చేసి.. గుండు కొట్టించారు బంధువులు.

Woman beaten
కులాంతర వివాహం

By

Published : Jun 22, 2021, 12:04 PM IST

కులాంతర వివాహం చేసుకున్నదన్న కోపంతో ఓ యువతిని ఆమె సామాజిక వర్గానికి చెందిన వారు చితకబాది గుండు కొట్టించారు. హేయమైన ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బారాబంకీ జిల్లాలో జరిగింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు.

బాధితురాలి తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితమే మరణించారు. అంతకుముందు నుంచే ఆ యువతి, యువకులు కలిసి ఉంటున్నారు. జూన్​ 20న వారిద్దరు ఓ గుడిలో పెళ్లి చేసుకుని..శిథిలమైన గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉంటున్నారు. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కోపంతో.. ఆ యువతిని అపహరించి.. ఆపై దాడి చేశారు ఆమె బంధవులు, సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు.

ఇదీ చదవండి:'కులాంతర వివాహం చేసుకున్నందుకు కుల బహిష్కరణ చేశారు'

ABOUT THE AUTHOR

...view details