తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళ లోదుస్తుల్లో రూ.కోటి విలువైన బంగారం - మహిళ లోదుస్తుల్లో 2.41కేజీలీ బంగారం

కర్ణాటకలో భారీ స్థాయిలో బంగారం బయటపడింది. దీని విలువ రూ.కోటికిపైగా ఉంటుందని కస్టమ్స్​ అధికారులు వెల్లడించారు. పసిడితో పాటు, విదేశీ సిగరెట్​లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపిన అధికారులు.. నిందితురాలిని అరెస్ట్​ చేసినట్టు వెల్లడించారు.

Woman arrested for smuggling 1 crore worth gold in underwear at Mangaluru Airport
మహిళ లోదుస్తుల్లో బయటపడిన రూ.కోటి విలువైన బంగారం

By

Published : Mar 11, 2021, 1:26 PM IST

కర్ణాటకలో భారీ స్థాయిలో పసిడిని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్​ అధికారులు. మంగళూరు విమానాశ్రయంలో ఓ మహిళ లోదుస్తుల్లో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా.. అధికారుల తనిఖీల్లో పట్టుబడింది. మొత్తం 2.41 కిలోల బంగారాన్ని గుర్తించిన అధికారులు.. దీని విలువ సుమారు రూ.1.10 కోట్లకుపైనే ఉంటుందని అంచనా వేశారు.

స్వాధీనం చేసుకున్న బంగారం
మహిళ నుంచి బయటపడిన 2.41 కిలోల బంగారం
విదేశీ సిగరెట్లు

ఇలా దొరికింది..

కాసరగోడ్​కు చెందిన సమీరా అనే ప్రయాణికురాలు.. దుబాయ్​ నుంచి మంగళూరు విమానాశ్రయంలో దిగింది. ఆమెను తనిఖీ చేయగా.. శానిటరీ ప్యాడ్లు, సాక్స్​లు, లోదుస్తుల్లో ఈ బంగారం వెలుగుచూసింది. పసిడితో పాటు విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సదరు మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు.. కోట్పా(సిగరెట్​, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం) కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.

ఇదీ చదవండి:అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల జైలు

ABOUT THE AUTHOR

...view details