తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీడీ కేసులో కర్ణాటక మంత్రి రాజీనామా

లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోళి రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించాలని కోరుతూ సంబంధిత లేఖను సీఎం యడియూరప్ప గవర్నర్​కు పంపారు.

Will resign if proven guilty, Karnataka minister
లైంగిక ఆరోపణల కేసులో ఆ మంత్రి రాజీనామా చేస్తారా?

By

Published : Mar 3, 2021, 1:47 PM IST

Updated : Mar 3, 2021, 2:18 PM IST

ఓ యువతిని లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి రమేశ్​ జర్కిహోళి.. తన పదవికి రాజీనామా చేశారు. సంబంధిత లేఖను ముఖ్యమంత్రి యడియూరప్పకు సమర్పించారు. "నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. నిష్పక్షపాత దర్యాప్తు జరిగేందుకు వీలుగా నేను నా పదవికి రాజీనామా చేస్తున్నా" అని అందులో పేర్కొన్నారు రమేశ్.

రమేశ్​ రాజీనామాను ఆమోదించాలని కోరుతూ ఆ లేఖను గవర్నర్​కు పంపారు యడియూరప్ప.

సీడీ విడుదలతో దుమారం

రమేశ్​పై ఆరోపణలకు సంబంధించి మంగళవారం ఓ సీడీ మీడియా సంస్థలకు అందింది. ఓ మహిళతో మంత్రి అభ్యంతరకర రీతిలో ఉన్న దృశ్యాలు కన్నడ రాజకీయాల్లో దుమారం రేపాయి. ఈ సీడీ ఆధారంగా.. రమేశ్​ జర్కిహోళి ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సామాజిక కార్యకర్త దినేశ్​ కల్లహళ్లి ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని ఆర్టీ నగర్​లో నివసిస్తున్న బాధితురాలిని ఓ లఘు చిత్రం నిర్మిస్తున్న సమయంలో విద్యుత్​ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మంత్రి లైంగికంగా వేధించారని అందులో పేర్కొన్నారు. ఈ విషయంపై తన వద్ద ఆధారంగా సీడీ ఉందని చెప్పిన బాధితురాలిపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

మొదట్లో ఖండించిన మంత్రి..

ఈ ఆరోపణలను మంత్రి రమేశ్​ జర్కిహోళి మొదట ఖండించారు. తన చిత్రాలను ఉపయోగించి ఎవరో సీడీని రూపొందించారని , ఇది ఫేక్ అని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు వెలుగులోని వస్తాయని, కేసును ఎదుర్కొంటానని, వెనుకంజ వేయబోనని ప్రకటించారు. చివరకు రాజీనామా చేశారు.

ఇదీ చదవండి:కర్ణాటక మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు

Last Updated : Mar 3, 2021, 2:18 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details