యూకేలో జాతివివక్ష ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే కఠిన చర్యలు చేపడతామని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. జాతివివక్షపై పోరులో తప్పక గెలుస్తామని సోమవారం పార్లమెంటు వేదికగా వ్యాఖ్యానించారు.
ఇటీవల ఆక్స్ఫర్డ్ విశవిద్యాలయం విద్యార్థిపై జాతివివక్ష ఘటనను ప్రస్తావిస్తూ రాజ్యసభలో ఎంపీ అశ్వినీ వైష్ణవ్ అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఈ విధంగా స్పందించారు.
"యూకే ప్రతిష్ఠకు భంగం కలుగుతున్న ఉద్దేశంతో ఈ ఘటనలపై ఆచితూచి వ్యవహరిస్తున్నాము. యూకేతో భారత్కు మంచి బంధం ఉంది. ఈ ఘటనలను పరిశీలిస్తున్నాము. అవసరమైతే వీటిని తీవ్రంగా పరిగణించి చర్యలు చేపడతాము. ఇది మహాత్మ గాంధీ పుట్టిన దేశం. కాబట్టి జాతివివక్షపై నిర్లక్ష్యం వహించే ప్రసక్తే లేదు."