Wife's Slap To Husband: దంపతుల మధ్య తలెత్తిన చిన్న వివాదం విడాకులకు దారితీసింది. క్షణికావేశంలో చేసిన పని.. ఆమె వివాహ బంధాన్ని నాశనం చేసింది. మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన దంపతులు.. 12 ఏళ్లుగా విదేశాల్లో నివసిస్తున్నారు. అయితే కరోనా మహమ్మారితో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా భారత్‌కు రావాలని నిశ్చయించుకున్నారు. దీంతో భోపాల్‌కు తిరిగి వచ్చి భర్త.. ఓ వ్యాపారాన్ని ప్రారంభించగా.. భార్య ఓ కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, వారు విదేశాల్లోనే చదువుతున్నారు.
భర్తను చెప్పుతో కొట్టింది.. కాపురాన్ని చేతులారా..! - దంపతులు విడాకుల న్యూస్
Wife's Slap To Husband: క్షణికావేశంలో చేసిన పని ఆమె వివాహ బంధాన్ని నాశనం చేసింది. కోపంతో భర్తను చెప్పుతో కొట్టంది ఓ భార్య. అవమానంగా భావించిన భర్త విడాకులు కోరాడు. తర్వాత భార్య తన తప్పును అంగీకరించినా.. ఫలితం లేకుండా పోయింది.
అయితే భారత్‌కు వెళ్లాలని భర్త తీసుకున్న నిర్ణయం భార్యకు నచ్చలేదు. దీంతో వీరిద్దరి మధ్య తరచూ.. గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కోపంతో ఉన్న భార్య.. భర్తను చెప్పుతో కొట్టింది. దీంతో ఆగ్రహించిన భర్త విడాకులకు దరఖాస్తు చేశాడు. అయితే కౌన్సిలింగ్ సమయంలో భార్య తన తప్పును ఒప్పుకుంది. కానీ భర్త మాత్రం ఈ అవమానాన్ని తాను జీవితాంతం భరించలేనని.. ఆమెతో జీవించలేనని చెప్పాడు. భర్తను ఒప్పించేందుకు భార్య తీవ్రంగా ప్రయత్నించినా.. అతడు అంగీకరించలేదు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది.
ఇదీ చదవండి:లైవ్ వీడియో.. మాజీ భార్య, కూతురిని కాల్చి చంపిన వ్యక్తి.. ఆపై తానూ..