ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లోని తురుబ్ నగర్ మార్కెట్లో అరుదైన ఘటన జరిగింది. కర్వా చౌత్ పర్వదినాన భార్యతో కాకుండా ప్రియురాలితో షాపింగ్‌కు వెళ్లాడు ఓ వ్యక్తి. భర్త వేరే యువతితో షాపింగ్‌కు వెళ్లిన విషయం తెలుసుకున్న భార్య కోపంతో ఊగిపోయింది. ఘటనాస్థలికి చేరుకుని అందరూ చూస్తుండగానే భర్త, అతడి ప్రియురాలిపై దాడి దిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
బాధితురాలికి మద్దతుగా మరికొంత మంది మహిళలు అక్కడికి వచ్చారు. ఈ ఘటన జరిగేటప్పుడు మార్కెట్లో జనాలు విపరీతంగా గుమిగూడారు. తురుబ్ నగర్‌లోని మార్కెట్ హనీమూన్లకు ప్రసిద్ధని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడకి మెహందీ పెట్టించుకునేందుకు మహిళలు ఎక్కువగా వస్తారని తెలిపారు. మార్కెట్లో గొడవ జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని ఘర్షణ సద్దుమణిగేటట్లు చేశారు. అందరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రియురాలి కుటుంబ సభ్యులను సైతం పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.