తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శత్రువులను ఇరికించాలని సొంత భార్యనే రేప్ చేయించి... - Muzaffarnagar wife murder

wife rape in baduan: శత్రువులను ఇరికించాలనే దురుద్దేశంతో సొంత భార్యపైనే స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు వివాహేతర సంబంధం వద్దన్నందుకు భార్య గొంతు కోసి హత్య చేశాడు ఓ కిరాతకుడు.

wife rape baduan
భార్యపైనే అత్యాచారం

By

Published : May 2, 2022, 1:18 PM IST

wife rape in Baduan: భార్యపై స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ భర్త. శత్రువులను ఇరికించాలనే దురుద్దేశంతోనే నిందితుడు ఈ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లోని బదాయూలో ఆదివారం జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం నిందితుడు తన భార్య(22)ను సహస్వాన్​ ప్రాంతంలోని అడవికి బైక్​పై తీసుకెళ్లాడు. అనంతరం స్నేహితుడిని పిలిచి అతడితో కలిసి రెండు సార్లు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత పోలీసులకు ఫోన్​ చేసి తన భార్యపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశాడు.

పోలీసు విచారణలో బాధితురాలు అసలు విషయం వెల్లడించింది. తన భర్త తమ గ్రామంలో ఇద్దరు వ్యక్తులను ఈ కేసులో ఇరికించాలని ఇలా చేశాడని తెలిపింది. వారితో గొడవలు కారణంగానే పగ తీర్చుకునేందుకు ఇలా చేశాడని పేర్కొంది. బాధితురాలి భర్త, అతని స్నేహితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

భార్య గొంతుకోసి..:వివాహేతర సంబంధం వద్దన్నందుకు సొంత భార్యనే గొంతు కోసి చంపేశాడు ఓ భర్త. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లోని రాంపుర్​లో ఆదివారం సాయంత్రం జరిగింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు.. ఆమె భర్త సోహన్‌లాల్, మామ రాంలాల్, మరిది పాపేంద్రపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు సోహన్​లాల్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్నారు. వివాహేతర సంబంధం వద్దన్న కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:గ్యాంగ్​స్టర్​ ఇంటిపై పోలీసుల రైడ్.. కాసేపటికే బాలిక మృతి.. ఏమైంది?

ABOUT THE AUTHOR

...view details