తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఊరి పిల్లలు స్విమ్మింగ్​లో చిచ్చర పిడుగులు

ఛత్తీస్​గఢ్​లో ఓ ఊరు. అందులో ఓ మురికి చెరువు. తెల్లవారగానే ఉరకలెత్తే ఉత్సహాంతో అక్కడికి చేరుకుంటారు కొందరు చిన్నారులు. చేపలతో పోటీ పడుతున్నారా! అన్నట్లు జోరుగా ఈత కొడతారు. స్విమ్మింగ్​లో వారి ప్రతిభకు కొదువ లేదు. దాంతో ఏకంగా ఆ ఊరికి 'క్రీడా గ్రామం' అనే పేరు తీసుకొచ్చారు. వారి నైపుణ్యాన్ని మెరుగుదిద్దితే.. దేశానికి పతకాల పంట ఖాయం! కానీ వారికి కావాల్సిన కనీస వసతులు కరవయ్యాయి. అయినా, స్విమ్మింగ్​లో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో అక్కడే నిరంతరం శ్రమిస్తున్నారు.

Why Purai village in Durg is called Khel village?
'క్రీడా గ్రామం'- మురికి చెరువులో ముత్యాల్లాంటి స్విమ్మర్లు

By

Published : Apr 11, 2021, 12:13 PM IST

ఛత్తీస్​గఢ్​లోని దుర్గ్​ జిల్లా హెడ్​క్వార్టర్స్​ నుంచి 12 కి.మీల దూరంలో ఉంది పురయ్ గ్రామం. కొన్నాళ్ల క్రితం వరకు ఆ గ్రామానికి ఏ గుర్తింపూ లేదు. కానీ, ప్రస్తుతం.. ప్రతిభ గల ఈతగాళ్లున్న ఊరుగా పేరుగాంచింది. అక్కడ ప్రతి ఇంటి నుంచి ఓ స్మిమ్మర్ ఉండటం విశేషం.

క్రీడా గ్రామం- వసతులు లేకున్నా వారెవ్వా అనిపిస్తున్న చిన్నారి స్విమ్మర్లు

మురికి చెరువులోనే..

ఊళ్లో ఉన్న డోంగియా అనే మురికి చెరువులోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణ తీసుకుంటున్నారు చిన్నారులు. స్విమ్మింగ్​ను కెరీర్​గా మలుచుకొని, దేశానికి కీర్తిప్రతిష్ఠలు తీసుకురావాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. దాదాపు 80 మంది బాలబాలికలు ఈ చెరువులోనే నైపుణ్యాలను ప్రదర్శిస్తూ అబ్బురపరుస్తున్నారు.

సాయ్​ నుంచి పిలుపు..

చిన్నారులు ఊరు చెరువులోనే శిక్షణ పొందుతున్నారని తెలుసుకున్న భారత క్రీడా సమాఖ్య(సాయ్).. తన బృందాన్ని పురయ్​కు పంపింది. అక్కడ చిన్నారుల ప్రతిభ చూసి అధికారులు నోళ్లు వెల్లబెట్టారు. పిల్లల్లోంచి 12 మందిని అకాడమీలో శిక్షణ కోసం కూడా ఎంపిక చేశారు. అనంతరం గుజరాత్​లోని సాయ్​లో మూడేళ్లు ట్రైనింగ్​ పొందిన వారు.. లాక్​డౌన్​ తర్వాత తిరిగి గ్రామానికి చేరుకున్నారు. మళ్లీ అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు.

పతకాలతో చిన్నారి స్విమ్మర్లు

అకాడమీలో ఆరేళ్లు శిక్షణ తీసుకున్న చంద్రకళ ఓజా.. తాను స్విమ్మింగ్​లో ఓనమాలు నేర్చుకున్న పురయ్​ చెరువులోనే మళ్లీ ప్రాక్టీస్​ సాగిస్తోంది. మెరుగైన వసతులు కల్పిస్తే.. భారత్​కు ఒలింపిక్ స్థాయిలో పతకం సాధిస్తానని ధీమాగా చెబుతోంది.

పరిస్థితులు వేరు..

దొమన్​లాల్ దీవాంగన్.. జాతీయ స్థాయి స్విమ్మర్​. తన ఊళ్లోని ఓ వ్యక్తి ఈత కొట్టడం చూసినప్పటి నుంచి దానిపై తనకు ఆసక్తి కలిగిందని చెప్పాడు. అనంతరం.. కోచ్​ ఓం ఓజా నుంచి దొమన్​లాల్ శిక్షణ తీసుకున్నాడు. తొలుత ఈత గురించి ఏమీ తెలియని తను.. ఆరేళ్లుగా అందులో బాగా రాణిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఊళ్లో నుంచి శిక్షణ కోసం అకాడమీ వెళ్లినప్పుడు వింతగా, అక్కడి పరిస్థితులు భిన్నంగా ఉండేవని చెప్పాడు.

దొమన్​లాల్ దీవాంగన్

సుదీర్ఘ ప్రాంతాల నుంచి..

ప్రస్తుతం.. పురయ్​కు క్రీడా గ్రామంగా పేరొచ్చింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఎంతో మంది చిన్నారులు అక్కడ శిక్షణ తీసుకోవడానికి వస్తున్నారు.

అన్నింట్లో శిక్షణ..

ఈతలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాలుగు ప్రధాన స్టైల్స్​ ఉన్నాయి. అవి ఫ్రీ స్టైల్, బ్యాక్‌స్ట్రోక్, బ్రెస్ట్‌స్ట్రోక్, బటర్‌ఫ్లై. వాటన్నింటిలోనూ పురయ్​లోని చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు.

"ఫ్రీస్టైల్ ఈతలో.. ఈతగాడు మొదట కుడి చేయిని, ఆపై ఎడమ చేతిని ముందుకు వెనుకకు కదిలించి నీటిని చీలుస్తూ, కొలనులోకి దూసుకెళ్తాడు. బ్యాక్‌స్ట్రోక్‌లో.. ఈతగాడు తన లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనుకకు ఈత కొడతాడు. బ్రెస్ట్‌స్ట్రోక్‌లో.. తల తిప్పకుండా ఛాతీపై ఈత కొడతాడు. ఈ రకమైన ఈతలో, ఈతగాడు రెండు చేతులను ఒకేసారి కదిలిస్తూ, ఛాతీ సహాయంతో శరీరాన్ని కదిలిస్తాడు. బటర్​ఫ్లై స్ట్రోక్‌లో.. ఈతగాడు తన రెండు చేతులను నీటి ఉపరితలంపై ముందుకు వెనుకకు కదిలిస్తాడు. ఈత కొట్టేటప్పుడు, ఛాతీ, భుజాలను ఉపరితలంపై బ్యాలెన్స్ చెస్తాడు. పాదాలను ఒకే స్థాయిలో కదిలిస్తాడు." అని లక్కీ ఓజా అనే స్విమ్మర్​ వివరించాడు.

లక్కీ ఓజా

ఇదీ చూడండి:అసోం అంతర్జాతీయ పార్కుకు ఆ మూడు ఖడ్గమృగాలు

ABOUT THE AUTHOR

...view details