భారత్‌లో అంతకంతకు విస్తరిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున పరీక్షలు ఎందుకు నిర్వహించడం లేదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. అధికార భాజపాను ప్రశ్నించారు. కొత్త వేరియంట్‌పై ఇప్పుడు ఉన్న వ్యాక్సిన్ల ప్రభావం ఏమేరకు ఉంటుందో తెలపాలని కోరారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పుడు బహిర్గతం చేస్తారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
" డెల్టా ప్లస్ వేరియంట్‌ను మోదీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చెప్పాలి. దీనిపై టీకాల ప్రభావం ఏమేరకు ఉంటుంది అనేది బయటపెట్టాలి. మూడోదశను ఎదుర్కొనేందుకు కేంద్రం వద్ద ఉన్న ప్రణాళికను వివరించాలి."