హింసను ప్రేరేపించే విధంగా ఉండే టెలివిజన్ కార్యక్రమాలను నిలిపేసేందుకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. గతేడాది దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంపై పలు టీవీ ఛానళ్లు తప్పుడుగా ప్రసారం చేశాయంటూ జమియాత్-ఉలామా-ఐ-హింద్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ విధంగా స్పందించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం... సరైన సమాచారం ప్రజలకు అందించడం తప్పుకాదని, సమస్యంతా అది ప్రజలకు చేరవేసే విధానంలోనే ఉందని తెలిపింది.