ఒకటి లేదా రెండు డోసుల కొవిషీల్డ్(Covishield) టీకా తీసుకున్నవారితో పోలిస్తే.. కొవిడ్(Covid-19) నుంచి కోలుకుని ఒకటి/రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారు కరోనా 'డెల్టా రకం' వైరస్(Delta variant) నుంచి ఎక్కువ రక్షణ పొందుతున్నట్లు తాజాగా ఓ అధ్యయనం తెలిపింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ, కమాండ్ ఆసుపత్రి డిపార్ట్ మెంట్ ఆఫ్ న్యూరోసర్జరీ, సైనిక దళాల వైద్య కళాశాల శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కొవిషీల్డ్ టీకా ఒక డోసు, రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల్లో రోగనిరోధక స్పందనను ఈ సందర్భంగా మదింపు చేశారు.
టీకా పొందినవారికి ఇన్ఫెక్షన్ సోకితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటోందని పరిశోధకులు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో డెల్టా రకం నుంచి రక్షణ కల్పించడంలో హ్యూమరల్, సెల్యులర్ రోగనిరోధక స్పందనలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. కొవిడ్ నుంచి కోలుకున్నవారు కనీసం ఒక్క డోసు తీసుకున్నా.. వారిలో సహజంగానే ఎక్కువ యాంటీబాడీలు ఉండటం వల్ల మరోసారి ఇన్ఫెక్షన్ బారిన పడటం నుంచి, అలాగే కొత్తగా వస్తున్న వైరస్ రకాల (Variant) నుంచి రక్షణ పొందుతున్నట్లు అధ్యయనం పేర్కొంది.
భారత్లో వ్యాక్సినేషన్ క్రమం భేష్..