బంగాల్లో మరోసారి భారీ స్థాయిలో బాంబులు బయటపడటం కలకలం రేపింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భట్పారా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో బాంబులు, బాంబు తయారీ పరికరాలు, గన్‌పౌడర్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై పేలుడు పదార్థాలు, ఆయుధాల నియంత్రణ చట్టాల కింద కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
రాష్ట్రంలో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తోంది.