బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కూచ్‌బిహార్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి.. నేరస్థులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబసభ్యులకు దీదీ పరామర్శ "కూచ్‌బిహార్ ఘటనకు కారకులైన వారిని చట్టపరంగా శిక్షిస్తాం. కాల్పుల తర్వాత 72 గంటల పాటు ఈ ప్రాంతంలో పర్యటించటం నిషేధం కాబట్టి బాధిత కుటుంబాలను కలవలేకపోయాను."
-- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
ఏప్రిల్ 10న పోలింగ్ కేంద్రం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన తొలి ఓటర్ 18 ఏళ్ల ఆనంద్ బర్మాన్ కుటుంబానికి సైతం న్యాయం చేస్తామని దీదీ తెలిపారు.
బంగాల్ నాలుగో విడత పోలింగ్ సందర్భంగా కూచ్‌బిహార్ జిల్లాలోని సీతల్‌కుచి ప్రాంతంలో ఘర్షణ తలెత్తింది. బలగాల కాల్పుల్లో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో పర్యటించకుండా నిషేధం విధించింది ఈసీ.
ఇదీ చదవండి :బంగాల్ దంగల్: దళితుల అండ దక్కేదెవరికో!
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌కు కరోనా