బంగాల్ ఎన్నికల అనంతరం కొలువుదీరిన 17వ అసెంబ్లీ తొలి సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు సిద్ధమైన బంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు చేదు అనుభవం ఎదురైంది. సభ ప్రారంభం కాగానే.. ఎన్నికల అనంతరం జరిగిన హింసపై విచారణ జరపాల్సిందేనని ప్రతిపక్ష భాజపా ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. అంతటితో ఆగక వెల్లోకి దూసుకెళ్లి ఎన్నికల అనంతర హింసపై చర్చకు డిమాండ్ చేశారు.
దీనితో గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ప్రసంగాన్ని 3-4 నిమిషాలకే ఆపేయాల్సి వచ్చింది. అనంతరం భాజపా ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
అంతకుముందు తన ప్రసంగంలో రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింస గురించి గవర్నర్ ప్రస్తావించగా.. భాజపా సభ్యులు 'జై శ్రీ రామ్', 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేశారు.