పశ్చిమ్ బంగాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జల్పాయీగుడీ జిల్లా ధుప్గుడీలో గత రాత్రి జరిగిన ప్రమాదంలో 14 మంది మరణించారు. ఓ రాళ్ల ట్రక్కు.. మారుతీ వ్యాన్, టాటా మ్యాజిక్ కార్లను ఢీకొట్టడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది.
రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి- ప్రధాని విచారం - road accident latest
07:34 January 20
రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి- ప్రధాని విచారం
పొగ మంచు కారణంగానే రోడ్డుపై వాహనాలు కనిపించలేదని, ఈ క్రమంలోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ప్రధాని విచారం..
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రలు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి ద్వారా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు పరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.