Weekly Horoscope : ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందంటే.. - లేటెస్ట్ తెలుగు రాశి ఫలాలు
Weekly Horoscope: జనవరి 1 నుంచి జనవరి 7 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?
ఈ వారం మీ రాశి ఫలం
By
Published : Jan 1, 2023, 6:37 AM IST
Weekly Horoscope: జనవరి1 నుంచి జనవరి7 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?
ముఖ్యకార్యాల్లో శ్రద్ధ అవసరం. ఆటంకాలు ఉంటాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి. గతానుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి. ధర్మం రక్షిస్తుంది. నమ్మినబాటలో ముందుకెళ్లండి. కాలం వ్యతిరేకంగా ఉంది. అందరినీ నమ్మవద్దు. దగ్గరివారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వారాంతంలో విజయం ఉంది. నవగ్రహశ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది.
ఉద్యోగంలో లక్ష్యం నెరవేరుతుంది. దైవానుగ్రహంతో అనుకున్నది సాధిస్తారు. క్రమంగా లాభపడతారు. పెద్దల ప్రశంసలుంటాయి. గౌరవం పెరుగుతుంది. ఇంట్లోవారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో విజయముంది. ధనయోగం సూచితం. వివాదాలకు దూరంగా ఉండాలి. శుభవార్త వింటారు. సూర్యనమస్కారం శుభప్రదం.
విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. పట్టుదలగా పనిచేసి సత్ఫలితాన్ని పొందుతారు. అతిగా ఆలోచించవద్దు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశపరిచేవారుంటారు, సౌమ్యంగా సమాధానమివ్వాలి. వ్యాపారపరంగా మిశ్రమఫలితం. మిత్రుల అండ లభిస్తుంది. వారాంతంలో శ్రమ ఫలిస్తుంది. ఇష్టదైవస్మరణ శక్తినిస్తుంది.
అద్భుతమైన శుభకాలం. స్వల్పప్రయత్నంతోనే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. దైవబలం కాపాడుతోంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. వ్యాపారంలో అధిక లాభాలు ఉన్నాయి. ధనధాన్యలాభం ఉంది. బంగారు భవిష్యత్తు గోచరిస్తోంది. ఇష్టకార్యసిద్ధి ఉంటుంది. ఇష్టదేవతారాధన మంచిది.
మానసిక దృఢత్వం ముందుకు నడిపిస్తుంది. పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ప్రశాంత చిత్తంతో సమాధానమివ్వాలి. ప్రతి అడుగూ ఆలోచించి వేయండి. పొరపాటు జరిగితే నష్టం ఎక్కువవుతుంది. కుటుంబసభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్త. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది.
వ్యాపారం శుభప్రదం. అవసరాలకు తగినట్లుగా పనిచేయాలి. ఉద్యోగంలో తెలియని ఆటంకం ఎదురవుతుంది. ఒత్తిడికి లోనవకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అభివృద్ధిని సాధిస్తారు. విశేషమైన ధనయోగం ఉంది. ఓర్పు చాలా అవసరం. ఉపద్రవాల నుంచి బయటపడతారు. సూర్యధ్యానం మనశ్శాంతినిస్తుంది.
ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. ఎదురుచూస్తున్న ఫలితం వస్తుంది. అభీష్టసిద్ధికై చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ప్రశంసలుంటాయి. తొందరవద్దు. సకాలంలో బాధ్యతలను నిర్వర్తించాలి. కొందరివల్ల ఇబ్బందులు కలుగుతాయి. దగ్గరివారితో సంప్రదింపులు మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. కుజశ్లోకం చదవండి, మనోబలం పెరుగుతుంది.
గొప్ప శుభకాలం. అన్నివిధాలా కలిసివస్తుంది. తలపెట్టిన కార్యాలు పూర్తి అవుతాయి. వ్యాపారంలో విశేష ధనలాభం ఉంది. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. స్థిరత్వం వస్తుంది. సత్సంబంధాలు పెరుగుతాయి. నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. చంచల స్వభావం పనికిరాదు. ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. ఆనందించే అంశముంది. లక్ష్మీధ్యానం శక్తినిస్తుంది.
దైవబలం రక్షిస్తోంది. ఉత్సాహంగా పని ప్రారంభించండి. ఆశించిన ఫలితం వస్తుంది. ఉద్యోగంలో ఆటంకాలు తొలగుతాయి. సత్సంకల్పంతో ఆశయాన్ని సాధిస్తారు. ఆస్తి విలువ పెరుగుతుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ అనుకున్నది సాధించండి. ఆదిత్యహృదయం చదవండి, చేస్తున్న కృషి ఫలిస్తుంది.
కాలం మిశ్రమంగా ఉంది. జాగ్రత్తగా పనులు పూర్తిచేయండి. అవసరాలకు ధనం అందుతుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. దేనికీ తొందరపడవద్దు. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. పనుల్ని సకాలంలో పూర్తిచేయాలి. కుటుంబసభ్యుల సలహాలు అవసరం. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, శాంతి లభిస్తుంది.
కాలం సహకరిస్తోంది. విశేషమైన ధనలాభం ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. ప్రశంసలు పెరుగుతాయి. అనుకున్నది సాధిస్తారు, అదృష్టవంతులవుతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. ప్రతిభతో పైకి వస్తారు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ప్రశాంతంగా రోజులు గడుస్తాయి. ఆస్తి వృద్ధిచెందుతుంది. లక్ష్మీదర్శనం శుభప్రదం.
అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. సాహసకార్యాల్లో అభివృద్ధి ఉంటుంది. ధర్మమార్గంలో లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. నూతన ప్రయత్నాలు కలసివస్తాయి. ఒక సమస్యని పరిష్కరిస్తారు. నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఆర్థికంగా మంచి ఫలితాలుంటాయి. ఆస్తి పెరుగుతుంది. లక్ష్మీస్మరణ మంచిది.