Weekly Horoscope ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందంటే - telugu weekly horoscope
Weekly Horoscope ఆగస్టు 21 నుంచి ఆగస్టు 27 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే
Weekly Horoscope
By
Published : Aug 21, 2022, 6:32 AM IST
Weekly Horoscope ఆగస్టు 21 నుంచి ఆగస్టు 27 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?
వ్యాపారంలో లాభపడతారు. ఉద్యోగంలో నమ్మకంతో పనిచేయాలి. సంకల్పం బలంగా ఉండాలి. కాలం మిశ్రమంగా ఉంది. పొరపాటు జరగనివ్వద్దు. కుటుంబసభ్యుల సలహాలు పనిచేస్తాయి. మానసిక సంఘర్షణ లేకుండా చూసుకోవాలి. అపార్థాలకు తావివ్వవద్దు. ఆచితూచి మాట్లాడాలి. ఆంజనేయస్వామిని ప్రార్థించండి, మనోబలం చేకూరుతుంది.
బ్రహ్మాండమైన విజయం ఉంది. ధర్మమార్గంలో ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నిస్సంకోచంగా పనులు ప్రారంభించండి. ఆర్థికస్థితి మెరుగు పడుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం. చెడు ఆలోచన రానివ్వవద్దు. సూర్యనమస్కారం శుభాన్నిస్తుంది.
ఉద్యోగంలో సమస్యలను అధిగమించి ప్రశంసలు అందుకుంటారు. స్థిరత్వం లభిస్తుంది. లక్ష్యాన్ని చేరతారు. వ్యాపారం బలపడుతుంది. లాభాలు వస్తాయి. ఖర్చు విషయంలో ఆలోచించండి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆనందించే అంశాలు ఉన్నాయి. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయం తీసుకునే సమయమిది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని స్మరిస్తే మంచిది.
అదృష్టకాలం నడుస్తోంది. ఆశించిన ఫలితం వెంటనే లభిస్తుంది. ఉద్యోగంలో కోరుకున్నట్లుగానే జరుగుతుంది. ఒత్తిడిని దగ్గరకు రానీయకుండా ప్రసన్న చిత్తంతో పనిచేయాలి. సమాజంలో గుర్తింపూ విశేషమైన కీర్తీ లభిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వృద్ధిచెందుతుంది. గతంలో ఉన్న కొన్ని సమస్యలు తొలగుతాయి. విష్ణుస్మరణ మంచిది.
వ్యాపారంలో అద్భుతమైన విజయం ఉంది. పనులు పూర్తవుతాయి. సంకోచం వద్దు. నమ్మకంలేని అంశాల్లోకి ప్రవేశించవద్దు. పట్టుదల రక్షిస్తుంది. మొహమాటం వల్ల సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాలి. పనుల్లో స్పష్టత అవసరం. ఇంట్లోవారి సూచనలు పనిచేస్తాయి. ఆదిత్య హృదయం చదవండి, శుభం కలుగుతుంది.
ఆర్థికంగా బాగుంటుంది. అధికారులనుంచి ఇబ్బందులు ఉండవచ్చు. సందర్భానికి తగినట్లుగా వ్యవహరించండి. ఏకాగ్రతతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. నమ్మిన ధర్మమే ముందుకు నడిపిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. ఇంట్లోవారి సూచనలతో సమస్య తొలగుతుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి, శాంతి లభిస్తుంది.
ఆత్మవిశ్వాసంతో పని మొదలుపెట్టండి, శుభం జరుగుతుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. చంచలత్వం వల్ల సమస్య రాకుండా జాగ్రత్తపడాలి. సొంత నిర్ణయం మంచిది. ఇతరులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా చూసుకోవాలి. నిందారోపణలు చేసేవారుంటారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, కలిసివస్తుంది.
ఉత్తమకాలం నడుస్తోంది. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. కాలం అన్నివిధాలా సహకరిస్తోంది. ప్రతిపనిలో విజయం ఉంటుంది. తగినంత మానవప్రయత్నం చేయండి. లక్ష్యం చేరువలోనే ఉంది. మనసులోని కోరికలు నెరవేరే కాలమిది. భూగృహ వాహనాది శుభయోగాలుంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. లక్ష్మీఆరాధన శ్రేష్ఠం.
శ్రమ ఫలిస్తుంది. ఆశయం నెరవేరుతుంది. ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది. స్వల్ప విఘ్నాలు ఎదురైనా అంతిమ విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడికి గురిచేసేవారున్నారు. సమయాన్ని బట్టి స్పందించండి. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి, శుభఫలితమే గోచరిస్తోంది. ఆదిత్యహృదయం చదివితే మంచిది.
ముఖ్యకార్యాలను వాయిదా వేయండి. ప్రతి అడుగూ ఆలోచించి వేయండి. అపార్థాలకు తావివ్వవద్దు. అభద్రతాభావాన్ని రానివ్వవద్దు. మిత్రుల సూచనలు తీసుకోవాలి. పొరపాటు జరిగితే దాన్ని వాడుకునేవారు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా పనిచేయాలి. ఆర్థికంగా మిశ్రమకాలం. నవగ్రహధ్యాన శ్లోకాలు చదువుకోవాలి.
గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమఫలితం సూచితం. అపార్థాలకు తావివ్వకండి. చంచలత్వం వద్దు. తెలియని ఒత్తిడి ఎదురవుతుంది. శాంతంగా ఆలోచించాలి. విఘ్నాలు ఇబ్బందిపెట్టినా అశాంతికి గురికావద్దు. ఆర్థికంగా అనుకూలకాలం. బంధుమిత్రులతో సంప్రదింపులు మేలుచేస్తాయి. నవగ్రహశ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది.
ఉత్తమ భవిష్యత్తు సూచితం. ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. తగినంత ప్రయత్నం చేయండి, ప్రతి పనిలోనూ లాభం ఉంటుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగం అనుకూలం. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. కుటుంబసభ్యుల సలహాతో సమస్యల్ని పరిష్కరించుకోవాలి. వారం మధ్యలో స్థిరమైన విజయం లభిస్తుంది. విష్ణుస్తుతి శుభప్రదం.