తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope From 1st To 7th October : ఆ రాశి ప్రేమికుల వివాహ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది! - ఈ వారం ఫలాలు

Weekly Horoscope From 1st To 7th October : అక్టోబర్​ 1 నుంచి అక్టోబర్​ 7 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope in telugu
Weekly Horoscope From 1st To 7th October

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 4:14 AM IST

Weekly Horoscope From 1st To 7th October : అక్టోబర్​ 1 నుంచి అక్టోబర్​ 7 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

మేషం (Aries) : ఈ వారంమేషరాశి వారికి కాస్త మధ్యస్థంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ఇబ్బంది తప్పదు. పెండింగ్ కేసుల్లో విజయం వరిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో మొదట్లో కొద్దిపాటి ఒడుదొడుకులు వచ్చినప్పటికీ.. తరువాత స్థిమిత పడతారు. వైవాహిక జీవితంలోని ఒత్తిడిలు తగ్గుతాయి. ప్రేమికులు ఒక్కడయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.

వృషభం (Taurus) :ఈ వారం వృషభ రాశివారు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నది.. జాగ్రత్త! వృత్తి, వ్యాపారాల్లో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. ఉద్యోగంలోనూ ఒత్తిడి పెరుగుతుంది. వివాహితులు మాత్రం అన్యోన్యంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి సాధించిన విజయం.. మిమ్మల్ని కూడా సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది. ప్రేమికులకు మాత్రం ఈ సమయం అనుకూలంగా ఉండదు. విద్యార్థులకు అనేక సవాళ్లు ఎదురవుతాయి. చదువులపై ఏకాగ్రత నిలుపలేరు. వారం చివరి రోజుల్లో మాత్రమే ప్రయాణాలు చేయడం మంచిది.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఆదాయం అనుకున్నంతగా రాదు. రాబడి విషయంలో ఒపిక పట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కొంచెం అశాంతి నెలకొంటుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ప్రత్యర్థుల నుంచి ప్రమాదం పొంచివుంది.. జాగ్రత్త! వ్యాపారులు మాత్రం లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ నుంచి కూడా సహకారం లభిస్తుంది. విద్యార్థులు చదువులపై దృష్టిసారిస్తారు. వారం ప్రారంభంలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (Cancer) : ఈ వారం కర్కాటక రాశివారికి అంతా బాగుంటుంది. జీతం పెరుగుతుంది. పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగా లాభపడతారు. నూతన వ్యాపార భాగస్వాములను చేర్చుకుని.. ఆర్థికంగా వృద్ధిని సాధిస్తారు. వైవాహిక జీవితంగా ఆనందకరంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.. కానీ దానికి తగిన కృషి అవసరం. వారం ప్రారంభంలో ప్రయాణాలు అనుకూలం.

సింహం (Leo) :ఈ వారం సింహ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి అనారోగ్యం మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది. దూరప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇతరులతో అనవసరంగా వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంటుంది. శాంతం వహించడం మంచిది. అయితే వైవాహిక జీవితంలో కొంత వరకు శాంతి నెలకొంటుంది. క్రమంగా ఆదాయం పెరగుతుంది. విద్యార్థులు కష్టపడి చదివి.. మంచి ఫలితాలు సాధిస్తారు.

కన్య (Virgo) : ఈ వారం కన్యరాశి వారికి అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని బాధపెడతాయి. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరే అవకాశం ఉంటుంది. వివాహితులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమికులకు మాత్రం ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది.

తుల (Libra) :ఈ వారం తుల రాశివారికి మధ్యస్థంగా ఉంటుంది. వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి. చట్టవిరుద్ధమైన పనులు చేస్తే మాత్రం.. సమస్యల్లో ఇరుక్కుంటారు. ఆదాయం పెరుగుతుంది.. మరోవైపు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. జీతం కూడా పెరుగవచ్చు. గృహ జీవితం మాత్రం అంత అనుకూలంగా ఉండదు. ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ప్రేమికులు ఒక్కటయ్యేందుకు ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు చదువుల్లో ఆటంకాలు ఎదురైనా.. కష్టపడి చదివి వాటిని ఆధిగమిస్తారు.

వృశ్చికం (Scorpio) :ఈ వారం వృశ్చికరాశివారికి మధ్యస్థంగా ఉంటుంది. మానసిక ఆందోళన, ఆరోగ్య క్షీణత ఉండవచ్చు. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపాారంలో మంచి లాభాలను సంపాదిస్తారు. ఉద్యోగంలో రాణిస్తారు. పై అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులు ఆర్థికంగా లాభపడతారు. వివాహితుల అన్యోన్యంగా ఉంటారు. ప్రేమికులకు మాత్రం ఈ సమయం అంత అనుకూలంగా లేదనే చెప్పవచ్చు. వారం చివరిలో ప్రయాణాలు చేస్తే కలిసివస్తుంది. విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది.

ధనుస్సు (Sagittarius) : ధనస్సు రాశివారు పిల్లలపట్ల చాలా ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. తమ వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. గృహ జీవితం ఆనందమయంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ప్రేమికులు వివాహ ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దైవారాధన చేసి.. మానసిక ప్రశాంతతను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. వారం మొదటి రోజు ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది.

మకరం (Capricorn) :ఈ వారం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మాత్రం కొద్ది పాటు ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. వ్యాపారులు తమ తెలివితేటలు ఉపయోగించి మంచి లాభాలు పొందుతారు. వివాహితులు మంచి శృంగార రసానుభూతి పొందుతారు. అన్యోన్యంగా జీవిస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారు స్నేహితులతో సరదాగా సమయం గడుపుతారు. అయితే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం ముఖ్యం. ఉద్యోగులు తమ పనిలో మంచి ఫలితాలను పొందుతారు. కానీ సహోద్యోగులతో మీ సంబంధం క్షీణించే అవకాశం ఉంది. వ్యాపారం ఈ వారం బాగానే ఉంటుంది. వివాహితులు గృహ జీవితంలో ఆనందం అనుభవిస్తారు. ఆనందిస్తారు. జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. ప్రేమికులకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు, మీ ప్రేమికుడికి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. విద్యార్థులు కచ్చితంగా చదువుపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

మీనం (Pisces) : మీన రాశివారికి ఈ వారం ప్రారంభంలో అంతగా బాగుండదు. ప్రతి విషయానికి ఆందోళన చెందుతారు. అయితే అదృష్టం కలిసి వచ్చి.. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలను గడిస్తారు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి కూడా లబ్ధి చేకూరుతుంది. భార్యాభర్తలు మాత్రం ఒకరినొకరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వారం చివరిలో ప్రయాణాలు చేస్తే అనుకూలమైన ఫలితాలు లభించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details