తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope From 15th To 21st October : ఆ రాశుల వారి ఇళ్లలో శుభకార్యాలు షురూ.. ఖర్చులు కూడా ఎక్కువే! - Weekly Horoscope From 15th To 21st October

Weekly Horoscope From 15th To 21st October : అక్టోబర్​ 15 నుంచి అక్టోబర్​ 21 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope in telugu
Weekly Horoscope From 15th To 21st October

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 5:05 AM IST

Weekly Horoscope From 15th To 21st October : అక్టోబర్​ 15 నుంచి అక్టోబర్​ 21 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

మేషం (Aries) :ఈ వారం మేష రాశివారికి బాగా అనుకూలగా ఉంటుంది. వ్యాపారంలో భాగంగా కీలకమైన ఒప్పందాలు చేసుకుంటారు. ఫలితంగా మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగులు కూడా రాణిస్తారు. కానీ వైవాహిక జీవితంలో కొన్ని ఒడుదొడుకులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికులకు మాత్రం పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆకర్షణ, శృంగార భావాలు పెరుగుతాయి. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరిస్తారు. వారం ప్రారంభంలో ప్రయాణాలు చేయడం మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

వృషభం (Taurus) :ఈ వారం వృషభ రాశివారికి అనవసర ఖర్చులు పెరుగుతాయి. అప్పులు చేయాల్సి రావచ్చు. అనవసరమైన చర్చలు మీ మనస్సును కలవరపరుస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. అయితే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. వారం చివరిలో ప్రయాణాలు చేస్తే.. పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. విద్యార్థులు మాత్రం బాగా కష్టపడి చదివితే.. కచ్చితంగా విజయం సాధిస్తారు.

మిథునం (Gemini) : ఈ వారం ప్రారంభంలో మిథున రాశివారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం దెబ్బతినవచ్చు. జాగ్రత్త! వృత్తి, వ్యాపారాల్లో అనుకోని ఇబ్బందులు, సమస్యలు ఏర్పడతాయి. వివాహితులను కుటుంబ సమస్యలు కలవరపెడతాయి. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెద్ద పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. సంబంధాలు కూడా విచ్చినం కావచ్చు. జాగ్రత్త! ఈ వారంలో మిథున రాశివారు ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది.

కర్కాటకం (Cancer) : ఈ వారం కర్కాటక రాశివారికి అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. పాత సమస్యల నుంచి సులువుగా బయటపడతారు. వైవాహిక జీవితంగా సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. స్థిరాస్తి రంగంలోని వారు ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు గురువుల ఆశీస్సులు లభిస్తాయి.

సింహం (Leo) :ఈ వారం సింహ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లికానివారికి వివాహం కూడా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. వారం మధ్యలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులు ఒక్కటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగులు తమ పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు బాగా చదివితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య (Virgo) : ఈ వారం కన్య రాశివారికి బాగానే ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. అయితే ఇంట్లో వివాదాలు ఏర్పడవచ్చు. శాంతం వహించడం మంచిది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. అయితే జీవిత భాగస్వామి మీకు అన్నివిధాలా తోడుగా ఉంటారు. వారం ప్రారంభంలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతి పొందే సూచనలు కనిపిస్తున్నాయి.

తుల (Libra) :ఈ వారం తుల రాశివారికి అనుకోని ఇబ్బందులు కలుగుతాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. సమస్యల్లో ఉన్నప్పుడు మీ జీవిత భాగస్వామి సలహాను పాటించడం మంచిది. దీని వల్ల మీరు సమస్యల నుంచి గట్టెక్కుతారు. పైగా లాభపడతారు కూడా. వ్యాపారంలో మోస్తరు లాభాలు వస్తాయి. ఎప్పుడో ఆగిపోయిన పనులను.. మరలా ప్రారంభించే ప్రయత్నం చేయండి. ఉద్యోగులు పనిలో చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. ప్రేమికులకు సమయం అనుకూలంగా ఉన్నప్పటికీ.. జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం చేసే ప్రయాణాలు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.

వృశ్చికం (Scorpio) :ఈ వారం వృశ్చిక రాశి వారికి మధ్యస్థంగా బాగుంటుంది. వారం ప్రారంభంలో అనవసర ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. దానిపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఆదాయం పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగా ఖర్చులు కూడా ఉంటాయి. ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే కళాకారులు రాణిస్తారు. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరిస్తారు. ప్రేమికులు ఒక్కటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు మాత్రం సాదాసీదాగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగులకు మాత్రం సమయం అనుకూలంగా ఉంది.

ధనుస్సు (Sagittarius) : ఈ వారం ధనస్సు రాశివారికి బాగా అనుకూలంగా ఉంది. అన్నివిధాలుగా లాభాలు సంపాదిస్తారు. అయితే ఆరోగ్యం మాత్రం క్షీణించే అవకాశం ఉంది. జాగ్రత్త! వృత్తి, వ్యాపారాలు బాగా సాగుతాయి. ఉద్యోగులు తమ పనిలో రాణిస్తారు. అయితే గృహంలో లేనిపోని సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. శాంతంగా ఉండడం అలవరుచుకోండి. ప్రేమికులకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రేమికుల మధ్య వాదనలు, గొడవలు జరగవచ్చు. వారంలో చివరి రెండు రోజులు ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు సరైన గురువు సహకారంతో చదువులపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.

మకరం (Capricorn) :ఈ వారం మకర రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతి పొందే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సమాజంలో పరువు, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మికపరమైన చింతనలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. అయితే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. విద్యార్థులు బాగా కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం మధ్యస్థంగా బాగుంటుంది. వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. దీని వల్ల మానసికంగా ఆందోళన చెందుతారు. అయితే ఈ పరిస్థితి కూడా త్వరలో పరిష్కారం అవుతుంది. అయితే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వారం మధ్యలో ప్రయాణం చేస్తే.. అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు మాత్రం సరైన లాభాలు పొందుతారు. ఇతరులతో దురుసుగా ప్రవర్తించకండి.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. మీలోని లోపాలను అధిగమించే ప్రయత్నం చేయడం మంచిది. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. అనుకున్న పనిని ఎంత కష్టమైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఫలితంగా అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహితులు మాత్రం సంతోషంగా గడుపుతారు. వారం మధ్యలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే వారాంతంలో ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రయాణం చేయవద్దు.

ABOUT THE AUTHOR

...view details