తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Weekly Horoscope: డిసెంబరు 18 నుంచి డిసెంబరు 24 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

Weekly Horoscope
ఈ వారం మీ రాశి ఫలాలు

By

Published : Dec 18, 2022, 6:28 AM IST

Weekly Horoscope: డిసెంబరు18 నుంచి డిసెంబరు 24 వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

అవసరాలకు ధనం లభిస్తుంది. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు. మనోబలం అవసరం. ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. అనేక విఘ్నాలున్నాయి, ప్రణాళికతో పనిచేయాలి. గతానుభవం కాపాడుతుంది. స్వయంకృషితో పైకి వస్తారు. బంధుమిత్రుల అండ లభిస్తుంది. నవగ్రహధ్యానం మనోబలాన్ని పెంచుతుంది.

ఉద్యోగం అనుకూలం. ఒత్తిడిని జయిస్తారు. సాహసంతో తీసుకునే నిర్ణయాలు కలిసివస్తాయి. శుభాలు జరుగుతాయి. మంచితనం కాపాడుతుంది. పదిమందికీ ఆదర్శంగా ఉంటారు. అభీష్టసిద్ధి కలుగుతుంది. ధనలాభం గోచరిస్తోంది. కోరుకున్నది లభిస్తుంది. క్రమంగా పైకి వస్తారు. కుటుంబపరంగా ఆనందించే అంశముంది. ఇష్టదేవతాస్మరణ మంచిది.

పట్టుదలతో లక్ష్యాన్ని చేరాలి. కాలం కాస్త వ్యతిరేకంగా ఉంటుంది. ముందస్తు ప్రణాళికలు రక్షిస్తాయి. ఉద్యోగంలో ఆలోచించి అడుగేయండి. ఆపదలు పొంచివున్నాయి. చిన్న పొరపాటైనా పెద్ద సమస్య కాగలదు. శాంతంగా సంభాషించాలి. తోటివారి సహకారం అందుతుంది. వ్యాపారంలో ఓర్పుతో వ్యవహరించాలి. నవగ్రహస్తోత్రం చదివితే మేలు.

అత్యుత్తమ కాలం. శ్రేష్ఠమైన ఫలితాలున్నాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయండి, అభీష్టాలు సిద్ధిస్తాయి. నూతన విషయాలు తెలుసుకునే సమయం ఇది. జీవితంలో పైకి రావడానికి అవసరమైన ఆలోచనలు చేస్తారు. అవకాశాలను వినియోగించుకోండి. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. కుటుంబపరంగా శాంతి లభిస్తుంది. లక్ష్మీఆరాధన మంచిది.

శుభకాలం నడుస్తోంది, అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆపదను ముందుగా పసిగట్టగలిగితేనే పనుల్ని పూర్తిచేయగలరు. ఇంట్లోవారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ధర్మదేవత రక్షిస్తుంది. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. ఆదిత్యహృదయం చదివితే శాంతి చేకూరుతుంది.

మనోబలం విజయాన్నిస్తుంది. ఉద్యోగం అనుకూలం. సంశయం లేకుండా ధర్మమార్గంలో ప్రయత్నం చేయండి. అవసరాలకు డబ్బు లభిస్తుంది. ద్వేషించినవారే ప్రేమిస్తారు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. ఆపదలు పొంచివున్నా సమయస్ఫూర్తితో బయటపడతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సంతోషించే వార్త వింటారు. సూర్యధ్యానం శుభప్రదం.

పనులు పూర్తవుతాయి. శాంతచిత్తంతో పనిచేసి ప్రశంసలు పొందాలి. ఉద్యోగంలో అవరోధాలు తొలగుతాయి. చిత్తశుద్ధితో పనిచేసి గుర్తింపు పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. మౌనంగా మీ పని మీరు చేయండి. కొన్ని విషయాల్లో స్పష్టత అవసరం. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది. శివారాధన మంచిది.

ఉత్తమ కాలం. ప్రయత్నబలాన్ని బట్టి విజయం లభిస్తుంది. ఉద్యోగంలో శుభఫలితం ఉంది. అధికార లాభం సూచితం. సంపద పెరుగుతుంది. అదృష్టవంతులు అవుతారు. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి. జీవితంలో సాధించాల్సిన అంశాలు స్పష్టమవుతాయి. మిత్రుల వల్ల లాభముంటుంది. ఆదిత్యహృదయం చదవండి, ఆరోగ్యం బాగుంటుంది.

ఉద్యోగం అనుకూలం. శ్రమ పెరిగినా అభివృద్ధి ఉంటుంది. అధికారుల ఒత్తిడి ఉన్నా నిదానంగా సమాధానమివ్వాలి. ప్రతిభతో మెప్పిస్తారు. వారం మధ్యలో ఆనందించే అంశం ఉంటుంది. అభీష్టాలు త్వరగా సిద్ధిస్తాయి. వ్యాపారపరంగా మిశ్రమ ఫలితం. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వారాంతంలో శుభవార్త వింటారు. సూర్యనమస్కారం మంచిది.

ప్రతి అడుగూ ఆలోచించి వేయాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. అపార్థాలకు తావివ్వవద్దు. మొహమాటం పక్కనపెట్టి ధర్మబద్ధంగా పనిచేయాలి. నిజాయతీయే మిమ్మల్ని కాపాడుతుంది. నమ్మిన మార్గంలో ముందుకుసాగండి. నిర్ణయాలను మార్చవద్దు. సమష్టిగా కృషిచేస్తే సాధనకు రెట్టింపు ఫలితముంటుంది. నవగ్రహశ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది.

ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంది. గౌరవం పెరుగుతుంది. మీవల్ల ఇతరులకు మేలు జరుగుతుంది. ధర్మం రక్షిస్తుంది. పూర్వపుణ్యం సహకరిస్తుంది. ఆర్థికంగా వృద్ధి గోచరిస్తోంది. పలు మార్గాల్లో లాభపడతారు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఆశయం నెరవేరేవరకూ పని ఆపవద్దు. ఇష్టదేవతాదర్శనం శుభాన్నిస్తుంది.

ఉద్యోగ ఫలితం ఉత్తమం. రావలసినవి తిరిగి వస్తాయి. కీర్తి పెరుగుతుంది. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. సకాలంలో పనులు పూర్తిచేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది. ఆవేశం పనికిరాదు. సొంత నిర్ణయం మంచిది. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకండి. కుటుంబపరంగా ఆనందించే అంశముంది. స్థిరత్వం కలుగుతుంది. విష్ణుస్మరణ మంచిది.

ABOUT THE AUTHOR

...view details