సరిహద్దు సమస్యలను భారతదేశం.. శక్తిమంతంగా, దృఢనిశ్చయంతో సమర్థంగా ఎదుర్కొన్నట్టు విదేశాంగమంత్రి జైశంకర్ తెలిపారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పుణె ఇంటర్నేషనల్ సెంటర్ ఏర్పాటు చేసిన 'ఆసియా ఎకనామిక్ డైలాగ్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు జైశంకర్. కరోనా సంక్షోభాన్ని కూడా సమర్థంగా ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. అందరి వాదనలను పరిగణనలోకి తీసుకుని.. కరోనా సంక్షోభం వల్ల డీలా పడిన ఆర్థిక వ్యవస్థకు తనదైన శైలిలో కేంద్రం ఊతమందించిందని పేర్కొన్నారు.
"గతేడాది మూడు పెద్ద మార్పులు దేశంపై ప్రభావం చూపాయి. ప్రపంచాన్నీ ప్రభావితం చేశాయి. మొదటిది కొవిడ్, రెండోది సంక్షోభంలో ఆర్థిక పరిస్థితి, మూడు సరిహద్దులో సవాళ్లు. ప్రతి విషయంలోనూ ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఎన్నో చర్చలు జరిగాయి. ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. ప్రభుత్వం బాధ్యతగా మేం అందరి మాటలు విన్నాము. ఆ తర్వాతే.. దేశానికి ఏది మంచిదో అదే చేశాం."