చైనాతో మరోసారి చర్చలు జరిగితే తూర్పు లద్దాఖ్ సరిహద్దు వివాదం ఓ కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు. వాస్తవాధీన రేఖ వెంబడి అన్ని ఫ్రిక్షన్ పాయింట్ల నుంచి రెండు దేశాల బలగాలను పూర్తిగా ఉపసంహరించుకునే విధంగా పరస్పర అంగీకారం కుదిరే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక పరమైన సంప్రదింపులు ఇంకా జరుగుతూనే ఉన్నాయని మీడియా సమావేశంలో తెలిపారు శ్రీవాస్తవ. ఈ చర్చల వల్లే ఎవరి స్థితి ఏంటనే విషయంపై ఇరు దేశాలకు స్పష్టమైన అవగాహన వస్తోందని పేర్కొన్నాారు. అయితే భారత్-చైనా మధ్య మరో దఫా చర్చలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై మాత్రం శ్రీవాస్తవ స్పష్టత ఇవ్వలేదు.