తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మే 2న టీఎంసీ కథ కంచికే!' - దీదీపై మోదీ ఆరోపణలు

బంగాల్​లో మే 2న తృణమూల్ కాంగ్రెస్​ ప్రభుత్వం కథ ముగియనుందని జోస్యం చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. బంగాల్​ ప్రజలకు సేవ చేసేందుకు భాజపాకు ఒక్క అవకాశం ఇవ్వాలని హావ్​డా ప్రచార సభ వేదికగా ప్రజలను కోరారు.

modi in howrah
'పాలించేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి చాలు'

By

Published : Apr 6, 2021, 4:56 PM IST

Updated : Apr 6, 2021, 6:34 PM IST

బంగాల్​లో తృణమూల్ కాంగ్రెస్ కథ ముగియనుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఓడిపోతారనే భయంతోనే మమత తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని అరోపించారు. బంగాల్​ ప్రజలను కూడా దీదీ చులకన చేసి మాట్లాడారని విమర్శించారు.

"ప్రజలు డబ్బులు తీసుకుని ఓటేస్తారని దీదీ ఆరోపించారు. ఇది మిమ్మల్ని అవమానించడం కాదా? ఇందుకు మీరు ఈ ఎన్నికల ద్వారా బదులు తీర్చుకోవాలి" అని హావ్​డా ప్రచార సభలో అన్నారు మోదీ.

ప్రజలు ఎంతో నమ్మకంతో మమతా బెనర్జీకి ఓటు వేస్తే.. ఆమె ప్రజలను మోసం చేశారని మోదీ దుయ్యబట్టారు. ఇందుకు ప్రజలే సరైన సమాధానం చెప్పాలని అన్నారు. సేవ చేసేందుకు భాజపాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడమని మోదీ ప్రజలను కోరారు.

ఇదీ చదవండి:పుదుచ్చేరిలో 77.90శాతం పోలింగ్

Last Updated : Apr 6, 2021, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details