భాజపా కార్యకర్తలను గూండాలుగా అభివర్ణించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కాలికి గాయంతో బాధపడుతున్న తనను వైద్యలు విశ్రాంతి తీకుకోమన్నా.. భాజపాకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. అలిపుర్ద్వార్లో శుక్రవారం జరిగిన ఓ ర్యాలీలో మమత పాల్గొన్నారు.
"నందిగ్రామ్‌లో గురువారం పోలింగ్ బూత్‌కు ఎందుకు వెళ్లానో తెలుసా? బయటనుంచి వచ్చిన గూండాలు తుపాకులతో అక్కడ మోహరించారు. పరాయి భాషలో మాట్లాడుతున్నారు. భాజపా కార్యకర్తలు రౌడీలు. ఆ పార్టీ మనకు వద్దు. గుర్తు పెట్టుకోండి. నేను మీ కాపలాదారును. వైద్యులు నన్ను విశ్రాంతి తీసుకోమని చెప్పారు. కానీ, రాజకీయ సంగ్రామంలో ఒంటరిగా పోరాడే అవకాశం భాజపాకు ఇవ్వదలచుకోలేదు."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
భయపెడుతున్నారు..