దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు రోజుకో రూపును సంతరించుకొంటున్నాయి. ఇప్పటికే కొందరు వ్యక్తులు రైతులకు మద్దతు తెలుపుతూ వినూత్నంగా నిరసన గళం వినిపిస్తోంటే... తాజా కర్షకులు సింఘూ సరిహద్దుల్లో వాలీబాల్ ఆడుతూ నిరసన తెలిపారు.
సామూహిక భోజనాలు చేసిన తరువాత మేమంతా ఇలా వాలీబాల్ ఆడుతాం. నిరసన తెలపడంలో ఇదో పద్ధతి. కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం.