తెలంగాణ

telangana

By

Published : Jul 3, 2023, 1:15 PM IST

Updated : Jul 3, 2023, 2:14 PM IST

ETV Bharat / bharat

Viveka case: వివేకా హత్య కేసు సంబంధ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

Viveka case
Viveka case

13:10 July 03

కృష్ణారెడ్డికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కోర్టు ముందు ఉంచుతాం: సునీత న్యాయవాది

Viveka murder case petition updates: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి.. తనను బాధితుడిగా గుర్తించాలంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ఈరోజు న్యాయస్థానం విచారణ జరిపింది. విచారణలో భాగంగా వివేకా హత్య కేసు సంబంధ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. వివేకా హత్యపై తొలుత ఫిర్యాదు చేసినందున తనను బాధితుడిగా గుర్తించాలని కృష్ణారెడ్డి ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించి.. పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌లో తనను బాధితుడుగా గుర్తించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ క్రమంలో వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత తరుఫు న్యాయవాది న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఇటీవల సీబీఐ మరో చార్జిషీటు దాఖలు చేసిందని ధర్మాసనానికి తెలిపారు. ఆ చార్జిషీటులో కృష్ణారెడ్డికి సంబంధించిన వివరాలు ఉన్నాయని వివరించారు. కృష్ణా రెడ్డికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా కోర్టు ముందు ఉంచుతామని సునీత న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. దీంతో సునీత తరుఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. కేసు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తనను బాధితుడిగా గుర్తించండి.. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో తనను బాధితుడిగా గుర్తించాలంటూ తాజాగా పీఏ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో వివేకా హత్యపై తొలుత ఫిర్యాదు చేసింది తానేనని, అందుకు తనను బాధితుడిగా గుర్తించాలని కోరుతూ.. మిస్లేనియస్‌ అప్లికేషన్‌ దాఖలు చేశారు. తన పిటిషన్‌లో పేర్కొన్న విషయాలను పరిగణించేలా న్యాయస్థానం స్పష్టత ఇవ్వాలని కోరారు. అయితే, ఈ వాదనలను వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత వ్యతిరేకించారు. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం.. సీబీఐతోపాటు, ప్రతివాదిగా ఉన్న షేక్‌ దస్తగిరికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు (సోమవారం) ఈ కేసు విచారణను.. జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యాయవాది వాదనల అనంతరం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

లాయర్‌ను నియమించుకునే స్తోమత లేదు..మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి తనకు లాయర్‌ను నియమించుకొని, వాదనలు వినిపించే ఆర్థిక స్తోమత లేదని.. అందుకే ఉచిత న్యాయ సహాయం అందించాలని సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీని కోరారు. తన తరఫున వాదనలు వినిపించడానికి లాయర్‌ను నియమించాలని కోరుతూ.. దరఖాస్తు చేసుకున్నారు.

అలా కోరే హక్కు బాధితులకు తప్ప.. నిందితులకు ఉండదు.. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న డి.శివశంకర్‌ రెడ్డి.. తనను అప్రూవర్‌గా అంగీకరించడాన్ని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గత విచారణలో.. జస్టిస్‌ ఎంఆర్‌ షా నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిటిషన్ కొట్టేవేసింది. అనంతరం ఇలా కోరే హక్కు బాధితులకు తప్పితే, నిందితులకు ఉండదని స్పష్టం చేసింది. బాధితులెవరైనా పిటిషన్‌ దాఖలు చేస్తే, అప్పుడు పరిశీలిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో తనను బాధితుడిగా గుర్తించాలని కోరుతూ.. వివేకానంద రెడ్డి వ్యక్తిగత సహాయకుడు ఎంవీ కృష్ణారెడ్డి మిస్లేనియస్‌ అప్లికేషన్‌ దాఖలు చేశారు. ఈ హత్య గురించి తొలుత ఫిర్యాదు చేసింది తానే కాబట్టి తనను బాధితుడిగా పరిగణించేలా స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Last Updated : Jul 3, 2023, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details