తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పోలీస్​స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి.. కానిస్టేబుల్‌పై మూక దాడి.. ఏం జరిగింది? - delhi latestnews

పోలీస్​స్టేషన్​లోకి చొరబడి హెడ్​కానిస్టేబుల్​ను చితకబాదింది ఓ అల్లరిమూక. జులై 31న దిల్లీ.. ఆనంద్​విహార్​ స్టేషన్​లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దాడికి పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు డీసీపీ సత్యసుందరం వెల్లడించారు. అసలేం జరిగిందంటే?

viral-video-shows-constable-beaten-by-mob-inside-police-station-in-delhi
viral-video-shows-constable-beaten-by-mob-inside-police-station-in-delhi

By

Published : Aug 6, 2022, 8:24 PM IST

పోలీసుస్టేషన్‌లోకి చొరబడి మరీ.. కానిస్టేబుల్‌పై మూక దాడి

దేశ రాజధాని దిల్లీలో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అల్లరి మూక ఏకంగా పోలీస్​స్టేషన్‌లోకి చొరబడి కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడింది. పది నుంచి పన్నెండు మంది ఉన్న ఓ గ్యాంగ్​ ఆనంద్‌ విహార్‌ పోలీస్​స్టేషన్‌లోకి చొరబడి హెడ్‌కానిస్టేబుల్‌పై దుర్భాషలాడుతూ మూకదాడి చేసింది. ఈ ఘటన జులై 31న జరిగినప్పటికీ.. వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దాడికి సంబంధించిన వీడియోలు తాజాగా వైరల్‌గా మారాయి. దీంతో దిల్లీ డీసీపీ సత్యసుందరం స్పందించారు.

"జులై 31 అర్ధరాత్రి.. కర్కర్​దుమా ప్రాంతంలో ఓ మహిళపై ఒక వ్యక్తి దాడి చేసి బంగారు గొలుసు దొంగలించినట్లు కాల్​ వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు అజయ్​ను పట్టుకున్నారు.అనంతరం ఆనంద్​విహార్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఆ తర్వాత అజయ్​ సోదరుడి గ్యాంగ్​ వచ్చి స్టేషన్​లో రచ్చరచ్చ చేసింది. హెడ్​ కానిస్టేబుల్​ ప్రకాశ్​ను చుట్టుముట్టి దుండగులు మూక దాడి చేశారు. అంతే కాకుండా వీడియో తీసి వైరల్​ చేశారు."

-- డీసీపీ సత్యసుందరం

వెంటనే మిగతా పోలీసులు గాయపడిన కానిస్టేబుల్ ప్రకాశ్​ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారని డీసీపీ సత్యసుందరం తెలిపారు. దాడి చేసిన వ్యక్తులందరిపై కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. ఇద్దరు నిందితుల్ని అరెస్ట్​ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామన్నారు.

ఇవీ చదవండి:ఆ రైల్వే గేట్​ తీయాలంటే.. లోకో పైలట్​ ట్రైన్​ దిగాల్సిందే.. ఎందుకలా?

రెండు బైక్​లను బలంగా ఢీకొట్టిన స్కార్పియా.. బంపర్​లో బైకర్​ ఇరుక్కుని..

ABOUT THE AUTHOR

...view details